అవినీతిరహిత రెవెన్యూ వ్యవస్థ లక్ష్యం: ఎర్రబెల్లి

2288

మహబూబాబాద్, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): ప్రజలకు అవినీతి లేని వ్యవస్థ కొరకు రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్ శాఖలను ప్రక్షాళన చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో గ్రామీణా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇనుగుర్తిని మండల కేంద్రం చేస్తామని, జిల్లాకు ఇచ్చిన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజ్, సాగునీరు హామీలను నెరవేరుస్తామన్నారు.

ఎస్సార్ఎస్పీ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా సాగునీరు అందిస్తామని, జూన్ నుంచి సంవత్సరంలో 10 నెలలు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఇంటర్ ఫలితాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారని, అధికారులకు గులాబీ బాస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకుంటున్నాయని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావు, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఆరింటికి ఆరు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అన్నారు ఎర్రబెల్లి. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని 6వ ప్యాకేజీ పంపు ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వడం అనే ట్రయిల్ రన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు గాను ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు హరిప్రియా నాయక్, రెడ్యానాయక్, శంకర్ నాయక్ మంత్రి ఎర్రబెల్లికి మిఠాయిలు తినిపించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది.

ప్రజలకు అవినీతి లేని వ్యవస్థ కొరకు రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్ శాఖలను ప్రక్షాళన చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో గ్రామీణావ్యవస్థ నిర్వీర్యం అయింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇనుగుర్తిని మండల కేంద్రం చేస్తాం. జిల్లాకు ఇచ్చిన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ ,మెడికల్ కాలేజ్, సాగునీరు హామీలను నెరవేస్తాం. ఎస్‌ఆర్ఎస్‌పీ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా సాగునీరు అందిస్తాం. జూన్ నుండి సంవత్సరంలో 10 నెలలు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నా. ఇంటర్ ఫలితాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి’’ అని విమర్శించారు.