సేవలోనే కాదు… సంకల్పంలోనూ ‘ఉక్కు’

8
414 వీక్షకులు
  • చిత్తశుద్ధితో సత్తాచాటుకున్న ‘కమ్మెళ్ల’

(* పోతుమహంతి నారాయణ్)

చదువు పూర్తయ్యాక ప్రతీ యువకుడూ ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో లేదా జీవనోపాధికి పనికొచ్చే ఏదో ఒక రంగంలో స్థిరపడుతుంటాడు. అలా ఆయా వృత్తుల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు కొందరైతే, మరికొందరు తమ పని తాము చేసుకొంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే, తారాజువ్వల్లాంటి కళ్లతో లక్ష్యసాధన కోసం ఎదురు చూసే యువకులూ అరాకొరా అక్కడక్కడ, గంజాయి వనంలో తులసి మొక్కళ్లా దర్శనమిస్తుంటారు.

వాళ్ల ఆలోచనా తీరే ఇతరులకంటే భిన్నంగా ఉండడంతో పాటు బుద్ది కౌసల్యంతో ఏదో సాధించాలని ఆరాటపడుతుంటాడు. అలా ఆరాటపడే ఆణిముత్యాలు ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టి వెతికినా మచ్చుకు కూడా కనిపించడం లేదనుకోండి. కానీ, కమ్మెళ్ల బంగార్రాజు అనే యువకుడు మాత్రం పువ్వుపుట్టగానే పరిమళించినట్లు భూమ్మీద పడగానే తనలోని భిన్నత్వం కోసం ఆలోచించాడేమో అనిపిస్తుంది. ఇప్పటిలా ఆధునిక సాంకేతికత, కాన్వెంట్, కార్పొరేట్ విద్య అందుబాటులో లేకపోయినా కష్టపడి ‘దుంపల బడి’గా నాటి తరం ముద్దుగా పిలుచుకునే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారు.

అక్కడితో తన పరుగు ఆపక ఉన్నత విద్యలోనే తన సత్తాచాటుకుని చివరికి అనుకున్నది సాధించి ‘వైజాగ్ స్టీల్’లో మేనేజర్ స్థాయికి చేరుకుని రేపటితో తన పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందుతున్నారు. అదేంటీ ‘సీఎండీ’ స్థాయి వాళ్లు రిటైర్ అయితేనే, రెండు మూడు లైన్లు కూడా రాయని స్థాయికి ఎదిగిన మీడియా ‘మేనేజర్’గా పదవీ విరమణ చేస్తున్న బంగార్రాజును కీర్తిస్తుందేమిటన్న సందేహం చాలా మందికి రావచ్చు. అందరిలాంటి బంగార్రాజు అయితే ఇంతలా చెప్పాల్సిన పనేముంది? పదిమందికి ఉపయోగపడిన ఆదర్శవంతుడు కాబట్టే చెప్పాల్సి వస్తోంది.

1960 జులై 1న జన్మించిన కమ్మెళ్ల బంగార్రాజు లక్కవరపు కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) విద్యార్ధిగా 1975-76లో బాహ్యప్రపంచంలో అడుగుపెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి పాత్రికేయునిగా తొలుత వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. విశాఖ నగరంలో పౌర, పత్రికా సంబంధాల నిర్వహణలో సమోన్నతమైన స్థానం పొందేవరకు అవిరాళ కృషి చేసి విజయం సాధించి ఔరా! అనిపించుకున్న బంగార్రాజు రాస్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆధీనంలోని విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో మీడియా రిలేషన్స్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. దివంగత మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు దగ్గర నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి వాళ్లను తలచేవారందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయనే.

స్వయంకృషి, పట్టుదల, నిరాడంబరత, మానవ విలువలు, నైతికతకు పట్టంకట్టి తన సమర్ధతతో అందరినీ మెప్పించ గలిగారు. ఆయనే అందరి మనసులను దోచుకున్న ముద్ద మందారం కమ్మెళ్ల బంగార్రాజు. విలక్షణమైన వ్యక్తిత్వం, పరోపకారం, పారదర్శకత, సమయపాలన, పత్రిక, పౌర సంబంధాలు నిర్వహణలో ఎవరు గొప్పంటే ముందు వరుసలో మొదటిగా ఉండేది బంగార్రాజే. 1988లో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో ఉద్యోగంలో చేరింది మొదలుకొని నాటి నుండి నేటి వరకూ ప్లాంట్ ప్రతిష్టను పెంపొందించేందుకు ఎంతగానో శ్రమిస్తూ వచ్చారు. ప్లాంట్ వ్యవస్థాపక సీఎండీ డి.ఆర్. అహుజా నుండి నేటి సీఎండీ పి.కె. రథ్ వరకూ తన పనితీరుతో అందర్నీ మెప్పించగలగారు. 1981-85 మధ్య పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డబుల్ ఎం.ఎ.తో పాటు ఎంఫిల్ పూర్తిచేశారు.

మాస్టర్ డిగ్రీ ఇన్ పాలిటిక్స్ పూర్తి చేసి 436 మంది విద్యార్థుల్లో రెండో ర్యాంకును సాధించారు. మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, న్యూస్‌పేపర్స్ అండ్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఎంఫిల్ చేశారు. పబ్లిక్ రిలేషన్స్, ఇంగ్లీష్‌లో పీజీ డిప్లొమా చేశారు. ప్రెస్ రిలీజెస్, పబ్లిసిటీ, జర్నలిజం, ఇంటర్నెల్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, పబ్లికేషన్స్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్, రైటింగ్ తదితర ప్రత్యేకతలను చాటుకున్నారు. స్టీల్‌ప్లాంట్లో చేరింది మొదలు కొని నిర్విరామంగా పని చేస్తూ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగానికి దేశీయంగా, అంతర్జాతీయంగానూ ఖ్యాతిని తెచ్చి పెట్టడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొన్నారు బంగార్రాజు.

ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ సమాచారం కావాలన్నా బంగార్రాజుకు చెప్పగానే అది జరిగిపోతుందన్న పేరును తెచ్చుకొన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో మీడియా రిలేషన్స్, ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్‌లో విశేషమైన ప్రతిభాపాటవాలు కనబరిచిన బంగార్రాజు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల తాఖ మంత్రి రాజీత్ బెనర్జీ నుండి ‘స్టీలిస్ ఇండియా 2018’ అవార్డును అందుకొన్నారు. స్టీల్ మెటలర్జీ మాగజైన్‌లో అప్పట్లో ఈ విషయం ప్రముఖంగా ప్రచురితమైంది. బంగార్రాజు చురుకుదనం, పనితనం గుర్తించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి గుడివాడ గురునాధరావు 1991-92 మధ్య పర్సనల్ అసిస్టెంట్ గాను, అనకాపల్లి ఎంపీగా 1998-99 మధ్య ప్రైవేట్ సెక్రెటరీగా నియమించుకొని ఆయన సేవలు వినియోగించుకొన్నారు.

2018 నవంబర్ 26న కోల్‌కతాలో జరిగిన ‘ఇంటిగ్రేటెడ్ & సెకండరీ స్టీల్ సెక్టార్-గ్రోత్ అండ్ సర్వైవల్ స్ట్రాటజీస్’ జరిగిన జాతీయ సదస్సులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అప్పటి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి రజిబ్ బెనర్జీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన ‘స్టీలిస్ ఇండియా’ అవార్డును స్వీకరిస్తున్న బంగార్రాజు. ఆర్ఐఎన్ఎల్ – వీఎస్‌పీలో మీడియా సంబంధాలు, ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ రంగంలో తన అద్భుతమైన ప్రతిభ కనబర్చినందుకు బంగార్రాజును ఆరోజు ఘనంగా సత్కరించారు. స్టీల్ & మెటలర్జీ మ్యాగజైన్ రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ ఇండస్ట్రీ ప్రొఫెషనల్/లీడర్లకు ‘స్టీలిస్ ఇండియా’ అవార్డులు అందించారు. కోల్‌కతాకు చెందిన స్టీల్ అండ్ మెటలర్జీ పత్రిక ఈ అవార్డును ఏర్పాటు చేసింది. ఆ పత్రిక ఎడిటర్, కాన్ఫరెన్స్ కన్వీనర్ నిర్మాల ముఖర్జీ అతిరథ మహారథుల సమక్షంలో బంగార్రాజును అప్పట్లో ప్రశంసల్లో ముంచెత్తారు

విశాఖ మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వద్ద 2004-09 మధ్య ప్రైవేట్ సెక్రెటరీగా పనిచేసి ఆయన మెప్పును కూడా బంగార్రాజు పొందారు. అంతకు ముందు జర్నలిజం మాస్ కమ్యూనికేషన్స్ పట్ల ఉన్న అమితాసక్తితో 1984 – 85 మధ్య యూఏలోను 1985-87మధ్య డెక్కన్ క్రానికల్‌లో రిపోర్టర్, సబ్ ఎడిటర్‌గా పనిచేసారు. ఇటు వృత్తిపరంగా అటు కుటుంబ జీవనంలోని మేటిగా పేరుందిన బంగార్రాజు స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగం సీనియర్ మేనేజర్‌గా ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పీకే రథ్ ఇప్పటికే బంగార్రాజు చేసిన సేవలను గుర్తించి ప్రశంసలతో ముంచెత్తారు. పదవీ విరమణ చేస్తున్న బంగార్రాజు సేవలు సమాజానికి మరింతగా ఉపయోగపడాలని శ్లాఘించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న మా మంచి బంగార్రాజుగా పేరొందిన కమ్మెళ్ల బంగార్రాజు శేష జీవితం సుఖ సంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు, మనోవికాసంతో సాగాలని కోరుకొందాం. పదవీ విరమణ శుభాకాంక్షలతో…

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ‘ఎరుక’ తెలుగు దినపత్రిక ప్రాతీయ బాధ్యుడు; 9849147350)

8 COMMENTS

  1. [url=https://retina.us.org/]generic retin a[/url] [url=https://chloroquinaralen.com/]chloroquine online[/url] [url=https://hydroxychlorothiazide.com/]buy hydrochlorothiazide[/url] [url=https://malegra.us.org/]malegra 100 for sale[/url] [url=https://trazodonesale.com/]buy trazodone[/url]

  2. [url=https://flomax.us.com/]flomax drug[/url] [url=https://amitriptyline24.com/]amitriptyline 100 mg price[/url] [url=https://prazosin.us.com/]buy prazosin[/url] [url=https://priligy.us.com/]where to buy priligy[/url] [url=https://azithromycin.us.org/]buy azithromycin[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here