డీఏవీపీ (బీవోసీ) అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ

ఫైలు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మార్చి 31…

న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY – DAVP (ప్రస్తుతం Bureau of Outreach and Communication – BOCగా వ్యవహరిస్తున్నారు.) ఏడాదికి రెండుసార్లు (ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో) చేపట్టే న్యూస్‌పేపర్‌ల ఎంపానెల్‌మెంట్ (Empanelment)లో భాగంగా గత ఏడాది (2020) ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చిన ప్రింట్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ క్లాజు 6.3.1 ప్రకారం, ఈ ఏడాదిలో మొదటి (ఫిబ్రవరి) ఎంపానెల్‌మెంట్ ప్రక్రియకు గత (జనవరి) నెల 29వ తేదీనే నోటిఫికేషన్ విడుదల చేసిన డీఏవీపీ (బీవోసీ) అందుకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రచురణకర్తలకు అందుబాటులో పెట్టింది. గతంలో కన్నా సులభతరమైన విధానంలో దరఖాస్తుచేసుకునే వెసులుబాటు కల్పించడం ఈసారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు విధానం, మార్గదర్శకాలను డీఏవీపీ తన అధికారిక వెబ్‌సైట్‌ http://davp.nic.inలో పొందుపర్చారు. అదే నోటిఫికేషన్‌ను ఈ లింక్ https://newstime.in/wp-content/uploads/2021/01/Adv12822912021-1.pdf ద్వారా కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ లింక్‌ను క్లిక్ చేసి పరిశీలించవచ్చు.

త ఆగస్టులో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకున్న ప్రచురణకర్తలు ఎవరైనా ఫిజికల్ ఫైల్స్ సబ్‌మిట్ చేయకపోతే వారికి మరో అవకాశాన్ని ఇచ్చిన డీఏవీపీ, ఇప్పటికే ప్యానల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని కూడా గత నెల 19-21 తేదీల మధ్య నిర్వహించింది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన పీఏసీ సభ్యులు ఇంకా సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు గాని, ఫిజికల్ ఫైల్స్ గానీ ఏవైనా పెండింగ్‌లో ఉంటే వాటిని సబ్‌మిట్ చేసేందుకు అవకాశాన్ని కల్పించింది. సంబంధిత వివరాలను ఈ లింక్‌ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు…

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ… ఫిబ్రవరి 28

అన్నీ పక్కాగా ఉంటే ఎంపానెల్‌మెంట్ చాలా ఈజీ…

మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత ఫార్మెట్‌లో దరఖాస్తు సమర్పించిన ప్రచురణకర్తలు ఎంపానెల్‌మెంట్ పొందడం చాలా ఈజీ అనే చెప్పాలి. డీఏవీపీ నిర్ణయించిన ఫార్మెట్‌లో కాకుండా తమ ఇష్టప్రకారం దరఖాస్తులు సమర్పించిన వారు మాత్రమే ఈ ప్రయత్నంలో విఫలమవుతున్నారు.‌ ఏడాదిన్నర (18 నెలల) సీనియారిటీ కలిగిన (దిన, వార, పక్ష, మాస, ద్విభాష) ఇలా ఆర్ఎన్ఐలో నమోదైన అన్ని పత్రికలూ డీఏవీపీ (బీవోసీ) ఎంపానెల్‌మెంట్‌కు అర్హత సాధించినట్లే. అయితే, ఇంత వరకూ సరైన అవగాహన లేకనో, ఆర్ధిక ఇబ్బందుల వల్లో, లేక ఇతరత్రా అనేక కారణాల రీత్యో తెలియదు కానీ, ప్రచురణకర్తలు చాలా వరకూ అన్ని అర్హతలు ఉండి కూడా డీఏవీపీ ‘రేటు కార్డు’ కోసం దరఖాస్తుచేయలేకపోయారు. కరోనా విపత్తు సమయంలో ప్రచురణ (ప్రింట్ మీడియా) రంగాన్ని ఆదుకోవాలన్న ఆశయంతోనే కావచ్చు, ఇలాంటి ఆపత్కాళ పరిస్థితుల్లోనూ డీఏవీపీ ఆగస్టు తర్వాత నిర్ణీత గడువులోనే ప్రింట్ మీడియా ఎంపానెల్‌మెంట్ నోటిఫికేషన్ జారీచేయడమే కాకుండా వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్ కోసం గత నెలలో ఆహ్వానించిన బిడ్‌లను పరిశీలించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ప్రచురణకర్తలు చాలా వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తుచేసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. పైరవీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అర్హత కలిగిన పత్రికలు పొందగలిగే ఈ ‘గర్తింపు’ను వదులుకోకుండా కనీసం ఈసారైనా జర్నలిజాన్ని నమ్ముకున్న ప్రచురణకర్తలు సద్వినియోగం చేసుకుంటారని సలహా.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాదిరిగానే వెబ్ మీడియాను కూడా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో అర్హత కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు ఎంపానెల్‌మెంట్ కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.inను సందర్శించవచ్చు.

కష్టపడితే వృధా ఖర్చు లేకుండా కూడా సాధించవచ్చు…

  • ఇక, ఆకర్షణీయమైన హంగులతో సొంత న్యూస్ వెబ్‌సైట్/ఛానల్ ఏర్పాటుచేయాలని ఉందా? నామమాత్రపు చార్జీలతోనే మీ పత్రికను, వెబ్‌సైట్/ఛానల్‌ను నిర్వహించాలని ఉందా? జర్నలిజంలో ప్రస్తుతం అతి కీలకంగా మారిన వెబ్ జర్నలిజంలో అడుగుపెట్టి ఆర్జించాలని ఉందా?
  • ప్రింట్ మీడియాలో కోల్పోయిన ఆదాయాన్ని ఆన్‌లైన్ యాడ్స్ రూపంలో పొందాలని ఉందా?
  • గూగుల్ యాడ్‌సెన్స్‌ (https://www.google.com/intl/en_in/adsense/start), యాహూ, యాడ్ జీబ్రా వంటి సంస్థల ద్వారా మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌‌లో ఎలాంటి పైరవీలు, శ్రమ లేకుండా యాడ్స్ ప్రచురించాలని ఉందా?
  • మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఉందా?
  • ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) కావాలా? ఫ్రీగా దొరికిందని ఏదో ఇతర వెబ్‌సైట్లలో పోస్టుచేసిన కంటెంట్‌ను తీసుకువచ్చి మీ సైట్‌లో పెట్టడం ద్వారా కోరి కాపీరైట్ కష్టాలు తెచ్చుకోవడం మినహా దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏ మాత్రం ఉండదని గమనించాలి.
  • సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా ఉండదని గుర్తించాలి.
  • సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.
  • పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ కూడా ఉచితం.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు…

కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/వెబ్ ఛానల్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే డైనమిక్ ఫార్మెట్‌లోని పూర్తి స్థాయి వెబ్‌సైట్/ఛానల్‌ను కేవలం 16,500 రూపాయలకే అందించే అత్యద్భుతమైన అవకాశాన్నీ ఈ సందర్భంగా ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది.

ఆయా పత్రికలు, వెబ్‌సైట్/ఛానల్ నిర్వహణ చార్జీల విషయంలోనూ ఊహించని తక్కువ చార్జీలకే సేవల్ని అందించేలా వెసులుబాటు కల్పించడం జరిగింది. గతంలో ఏ సందర్భంలోను, ఏ సంస్థా ఇవ్వని రాయితీ చార్జీలకే ‘న్యూస్‌టైమ్’ ఇస్తున్న సేవలు పొందేందుకు తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఔత్సాహికులు మా సర్వీస్ గురించి, వాటి వినియోగం గురించీ తెలుసుకునేందుకు మా రాయితీ సేవల్ని వినియోగించుకునేందుకు, నమోదు చేసుకునేందుకూ మా ఆధీకృత వెబ్‌సైట్ agency.newstime.inలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. తక్షణమే నమోదుచేసుకునేందుకు మా ప్రతినిధిని 6300795484 లేదా 9390556171 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా newstimedaily@gmail.com మెయిల్‌కు సంప్రదించి కూడా వివరాలను పొందవచ్చు.

ధన్యవాదాలతో,
Team NT
visit us; https://www.agency.newstime.in
https://www.newstime.in
6300795484 లేదా 9390556171
mail us; editor@newstime.in
newstimedaily@gmail.com