‘నిపుణ’ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు

0
20 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం టీ సాట్ ‘నిపుణ’ ఛానల్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన మేరకు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో 6 తరగతి నుండి 10 తరగతి విద్యార్థుల కోసం వచ్చే (మే) నెల 30వ తేదీ వరకు టీ సాట్ టీవీ నిపుణ ఛానల్ ద్వారా ఇంటి వద్దే ఆన్‌లైన్‌లో విద్యాబోధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

మొదటి క్లాసు ఉదయం 11 నుండి 12 గంటల వరకు, రెండవ క్లాసు12.15 నిమిషాల నుండి 1.15 నిమిషాల వరకు, మూడో క్లాసు 1:45 నుండి 2.45 వరకు, నాలుగవ క్లాసు 3.00 నుండి 4.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని సబ్జెక్టులతో పాటు ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, క్రీడలు, ఆరోగ్యానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయని, ప్రతి రోజూ నాలుగు సబ్జెక్టులలో ఒక్కో గంట ఎంపిక చేసిన అంశాలలో అన్ని విషయాలు గొలుసుకట్టు పద్ధతులలో సులభంగా అర్థమయ్యేలా బోధిస్తామని తెలిపారు.

విద్యార్థులు ఈ పాఠాలకు సంబంధించిన సందేహాలను సలహాలను 91332 56222 నంబరుకు వాట్సప్ లేదా ఎస్.ఎం.ఎస్. ద్వారా పంపితే వెంటనే సమాధానం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఊహించని విధంగా కరోనా రూపంలో వచ్చిన ఈ కష్ట పరిస్థితులలో ఈ ఆన్‌లైన్ పాఠాలు విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి తోడ్పడి వచ్చే విద్యా సంవత్సరానికి వారంతా జ్ఞాన దీక్షతో తయారవుతారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here