‘పైడి’ పలుకులు…

0
64 వీక్షకులు
  • విలువకోసం విలువలేని చోట ప్రయత్నించడం వున్న విలువను వదులుకోవడమే అవుతుంది.
  • సాగితే సత్పురుషుల వెనుక మన జీవితం నల్లేరుపై బండి నడక…
  • అసత్యంతో సాధించిన విజయంకంటే సత్యంతో సాధించిన అపజయం మేలు.
  • పంచ భూతాత్మకమైనది ఈ ప్రకృతి… పంచధర్మాలు ఆచరిస్తేనే మానవుడికి సద్గతి.
  • దుఖం ఙ్ఞానమనే స్వర్ణమయ కిరీటాన్ని ధరింపచేయడానికే వస్తుంది.. జీవితం వేదన కోసం కాదు.. సాధన కోసం.
  • ఆధునికత చిత్రపటంలోని నది ఆధ్యాత్మికత స్వచ్చమైన జీవనది.
  • దుర్వినియోగం చేయకుండా ఏ క్షణం.. విజయం వైపు సారించు నీ వీక్షణం.
  • ప్రకృతి నుండే వస్తున్నాం… దానిలోనే కలసిపోతాం.. ధర్మాన్ని ధిక్కరిస్తే మధ్యలోనే సమసిపోతాం.
  • మీరు చేసే పని మీకు ఇష్టమైనదే కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ కష్ట పడండి.. నేటి కష్టం రేపటి ఆనందానికి పునాది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here