పీకేసి… ఉతికి ఆరేసి!

1
15 వీక్షకులు

న్యూఢిల్లీ, జూన్ 4 (న్యూస్‌టైమ్): ఏ పల్లె అయినా… పట్టణమైనా మనిషికి కావాల్సింది కూడు… గూడు.. గుడ్ల.. ఈ మూడింటిలో ఆహారం, ఇల్లు వంటి కనీస అవసరాలు ఇప్పటికే ఆన్లైన్ బాట పట్టాయి. ఇందులో ఎన్నో వ్యాపారావకాశాలున్నాయని ఇప్పటికే అనేక స్టార్టప్స్ రుజువు చేశాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు లాండ్రీ సర్వీసులు కూడా చేరాయి. ఆధునిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ సంపాదించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఈ క్రమంలో ఇంట్లో సాధారణంగా బట్టలు ఉతికే తీరిక కూడా చాలామందికి ఉండడం లేదు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆన్‌లైన్ లాండ్రీ’ సర్వీసులకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్‌కు చెందిన ప్రమంత్ కుందుర్తి, చైతన్య. ‘పీకేసీ లాండ్రీ సొల్యూషన్స్’ పేరుతో స్టార్టపను ప్రారంభించి, లాభాల బాటలో నడిపిస్తున్నారు. పని పాతది… విధానం కొత్తది’ అనే రీతిలో సాంకేతిక హంగులను జోడించి ‘పీకేసీ లాండ్రీ సొల్యూషన్స్’‌ను ప్రారంభించారు ప్రేమంత్ కుందుర్తి, చైతన్య, వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు మరో పది మందికే పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్టార్టప్‌కి శ్రీకారం చుట్టారట.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ నగర వ్యాప్తంగా సర్వీసులను అందిస్తోంది. వినియోగదారుల నుంచి ఆర్డర్‌రాగానే, పీకేసీ సిబ్బంది వారి ఇంటికెళ్లి బట్టలను తీసుకొస్తారు. కంపెనీ పరిధిలో దోభీవాలాలకూ ఉపాధి కల్పిస్తున్నారు. ఇంటి నుంచి ఇంటికి… పీకేసీ వెబ్ సైట్, మొబైల్ యాప్, ఫేస్బుక్, వాట్సప్, ఫోన్ ఇలా ఏ మాధ్యమం ద్వారానైనా వినియోగదారులు ఆర్డర్ చేసుకునే అవ కాశాన్ని కల్పించారు. ఆన్లైన్లో సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా కస్టమర్ కేర్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆర్డర్ అందిన వెంటనే కంపెనీ ఎగ్జిక్యూటివ్ బాయిని పంపించి బట్టలను తీసుకుంటారు.

24 గంటల నుంచి 2 రోజులలోగా బట్టలను డోర్ డెలివరీ చేస్తారు. ఎలా పడితే అలా ఉతికితే దుస్తులు పాడవుతాయి. వాటి జీవిత కాలం కూడా తగ్గుతుంది. దీనిని అధిగమించడానికి కొన్ని ప్రత్యేక పద్దతులను అవలంభిస్తుంది పీకేసి. బట్టలు రంగు పోతున్నాయో లేదో పరీక్షిస్తారు. తమ వద్దకు బట్టలురాగానే ఒకే కుటుంబానికి చెందిన బట్టలు ఒకే రంగు ఉన్నవి.. ఖరీదైనవి.. ప్రత్యేకమైనవి.. ఇలా బట్టలను వివిధ రకాలుగా విభజిస్తారు. ఎలాంటి బట్టలను ఎలా ఉతకాలో నిర్ణయించి, వాటికి ట్యాగ్లు వేస్తారు.

ఆయా బట్టలను ఉతకడంలో అనుభవం ఉన్న దోభీవాలా లకు వాటిని అప్పగిస్తారు. శుభ్రమైన అర్వో నీరు, పర్యావరణహితంగా ఉండే డిటర్జెంట్లను ఉపయోగించి బట్టలను ఉతుకుతారు. దీంతో బట్టను ఎన్నిసార్లు ఉతికినా కొత్తవాటిలాగే కనిపిస్తాయి. నీరు కూడా చాలా తక్కువగానే అవసరమవుతుంది. ఆవిరి యంత్రాలతో బరన్ చేయడం వల్ల దుస్తుల రంగు వెలిసిపోదు. పైగా వాటి జీవిత కాలం కూడా పెరుగుతుంది. బట్టలను నాణ్యతగా ఉతకడంలో రాజీ పడమంటున్నాడు ప్రేమంత్.

వినియోగదారుల ఇంటి నుంచి తీసు కొచ్చిన బట్టలను ఉతికి, మళ్లీ వారికి అందించేవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని వీళ్లు చెబుతున్నారు. ఒక్కో గార్మెంటికి ఒక్కోరకమైన వాషింగ్ ఇన్ఫక్షన్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగానే బట్టలను ఉతుకుతామంటున్నారు ప్రేమంత్. ఏకేసి అధ్వర్యంలో అందుబాటు ధరల్లోనే లాండ్రీ సేవలను అందిస్తున్నారు.

  • నెలకు నాలుగు సార్లు…

నెలకు రూ. 499కే బట్టలను ఉతుకుతున్నారు. దీంతోపాటు రూ. 1099, రూ.1499 ప్యాక్లు కూడా అందుబాటులో ఉంచారు. రూ. 2799 ప్యాక్లో ఒక కుటుంబానికి నెలంతా సర్వీసులను అందజేస్తున్నారు. వీరికి నెలలో నాలుగు సార్లు బట్టలను ఉతికి మరి అందజేస్తారు. సమాజ సేవలోనూ పీకేసీ వ్యవస్థాపకులు బట్టలను వ్యాపార దృష్టితో మాత్రమే తీసుకోవడం లేదు. సమాజ సేవలోనూ పాలు పంచుకుంటున్నారు. వినియోగదారులు వినియోగించని, సైజులు సరిపోని, పాత బట్టలను తీసుకొని అనాథ శరణాయాల్లోని పిల్లలకు అందజేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కంట్రీబ్యూట్ అనే క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఎవరిదగ్గరనైనా పాత బట్టలున్నా, దానం,
చేయాలనుకున్నా తమ కంపెనీ వెబ్ సైట్లో ఉన్న కంట్రిబ్యూట్‌కు మెసేజ్ లేదా మెయిల్ చేయాలని కోరుతున్నారు.

కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ స్వయంగా వచ్చి, బట్టలను తీసుకుంటారు. వాటిని నగరంలోని అనాథాశ్రమాల్లో ఉన్న చిన్నారులకు అందజేస్తారు. ఆ బట్టలను ఎవరికి అందజేశారో కూడా పీకేసీ వెబ్ సైట్ ద్వారా దాతలకు తెలుపుతున్నారు.

1 COMMENT

  1. I simply want to tell you that I am just very new to blogging and truly savored this web-site. Likely I’m want to bookmark your website . You certainly have amazing article content. Regards for sharing your blog.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here