బందరు పోర్టుకు ప్రణాళిక

0
18 వీక్షకులు
ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, మ్యారిటైం బోర్డు సీఎండీ రామకృష్ణారెడ్డి, ఎపీ అర్బన్ మౌలిక వసతుల అభివృద్ది సీఈవో ప్రకాష్ గౌర్, ‘ముడ’ వైస్ చైర్మన్ పి. విల్సన్‌బాబు, ఆర్‌డివో ఎన్ఎస్‌కె ఖాజావలి, ఫిషరీస్ ఎడీ రమణబాబుతో కలిసి బందరు పోర్టు భూములను పరిశీలించిన మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
  • సమగ్రాభివృద్ధి వ్యూహంపై మంత్రి సమీక్ష

మచిలీపట్నం, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): బందరు పోర్టు సమగ్రాభివృద్ది ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర, రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ది ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, సంబంధిత ఉన్నతాధికారులతో కలసి మంత్రి సోమవారం ఆర్ అండ్‌ బి అతిధి గృహంలో సమావేశమై పోర్టుకు సంబంధించిన వివరాలు, భూ సంబంధ అవసరాలు, ఆర్దిక సంబంధ అంశాలు, పోర్టు డిజైన్స్ అంశాలపై మంత్రి సుదీర్ఝంగా చర్చించారు.

ఈ ప్రాంత అభివృద్ది గురించి భవిష్య అవసరాల గురించి మంత్రి వివరించారు. పోర్టు అభివృద్దికి సుమారు 2500 ఎకరాలు, భూమి అందుబాటులో వుందని అధికారులు నివేదించారు. పోర్టు డిజైన్స్ మంత్రి పరిశీలించారు. పోర్టుకు రైల్ రోడ్ కనెక్టివిటి సంబందించి భూమి సిద్దం చేయలన్నారు. పోర్టుకు అతి సమీపంలో గల 472 ఎకరాల భారత్ సాల్ట్ ల్యాండ్ పోర్టు అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి భూమికి భూమి పద్దతిలో సమీకరణకు నిర్ణయించారు.

సాగరమాల ప్రాజెక్టు క్రింద 47 కిలో మీటర్ల పోర్టు కనెక్టివిటి రహదారి గురించి సంప్రదించి భూసేకరణకు ప్రాజెక్టు అమలు గురించి మంత్రి సీఎస్‌తో చర్చించారు. త్వరగా పోర్టు పనులు మొదలు పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడంలో భాగంగా మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంటు కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దాని ద్వారా పోర్టు నిర్మాణంలో ఆపరేషన్స్ త్వరితగతిన జరుగుతాయని చెప్పారు. దీనికి సంబందించి నిధుల సమీకరణకు బ్యాంకర్లతో మాట్లాడి సమకుర్చాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి అధికారులతో కలసి మంగినపూడి, తపసిపూడి గ్రామంలో పోర్టు భూముల పరిశీలించారు. గిలకలదిండిలో ఫిషంగ్ హార్బరు పరిశీలించి మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మ్యారిటైం బోర్డు సీఎండీ రామకృష్ణారెడ్డి, ఎపీ అర్బన్ మౌలిక వసతుల అభివృద్ది సీఈవో ప్రకాష్ గౌర్, ‘ముడ’ వైస్ చైర్మన్ పి. విల్సన్ బాబు, బందరు ఆర్‌డివో ఎన్ఎస్‌కె ఖాజావలి, మత్స్యకార ఎడి రమణబాబు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here