న్యూఢిల్లీ, మే 13 (న్యూస్‌టైమ్): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద 8వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం (14వ తేదీన) వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు. ఈ పధకం ద్వారా 19 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనాన్ని, 9.5 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు, బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి, రైతు లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు.

పీఎం-కిసాన్ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారుల రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున, మూడు సమాన వాయిదాలలో, సంవత్సరానికి 6,000 రూపాయల మేర ఆర్థిక ప్రయోజనాన్ని అందజేస్తారు. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయస్తోంది కేంద్రం. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.15 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.