న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): భవిష్యత్తులో ఆచరణకు ఉద్దేశించినటువంటి ఒక మార్గ సూచిని గురించి, సంబంధిత దృష్టికోణం గురించి ఉన్నత స్థాయిలో చర్చించడం కోసం బ్యాంకులకు, ఇంకా ఎన్‌బిఎఫ్‌సిలకు చెందిన స్టేక్ హోల్డర్స్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున ముఖాముఖి సంభాషించారు. వృద్ధికి దన్నుగా నిలవడంలో ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థకు గల కీలక పాత్రను గురించి చర్చించడమైంది. చిన్న నవ పారిశ్రామికవేత్తలు, ఎస్‌హెచ్‌జిలు, రైతులు వారి వారి పరపతి అవసరాలను తీర్చుకొనేందుకు, ఎదిగేందుకు గాను సంస్థాగత రుణాలను వినియోగించుకొనేటట్టు వారిని ప్రేరేపించవలసి ఉందని గమనించడం జరిగింది. పరపతి మంజూరులో స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం కోసం ప్రతి ఒక్క బ్యాంకు అంతర్దర్శనం ద్వారా పున:పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. బ్యాంకులు అన్ని ప్రతిపాదనల విషయంలో ఒకే కొలమానం ఉపయోగించకూడదు, బ్యాంకు అనుమతించ తగినటువంటి, ప్రముఖమైనటువంటి ప్రతిపాదనలను గుర్తించాలి.

ఇంకా, ఆ ప్రతిపాదనలు వాటి యోగ్యతను బట్టి ఆర్థిక సహాయాన్ని అందుకొనేటట్టు చూడాలి అంతే తప్ప పాత ఎన్‌పిఎల పేరుతో కష్టపడకూడదు అని పేర్కొనడమైంది. ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థ వెన్నంటి నిలచిందని, ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థకు మద్దతివ్వడానికి, బ్యాంకింగ్ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడానికి అవసరపడే ఏ చర్యలనైనా సరే తీసుకోవడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించడమైంది. బ్యాంకులు కేంద్రీకృత‌ సమాచార వేదికల వంటి ఫిన్ టెక్ పద్ధతులను అనుసరించడం, డిజిటల్ డాక్యుమెంటేషన్, సమాచారాన్ని పంచుకోవడంలో సహకరించుకోవడం వంటి చొరవలు తీసుకొంటూ వినియోగదారులను సమీకరించుకోవడం కోసం డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతులు పరపతి వ్యాప్తిని విస్తరింపచేసుకోవడంలో, వినియోగదారులకు సౌలభ్యాన్ని పెంచడంలో, బ్యాంకులకు వ్యయాలను కుదించడంలో, మోసాలను తగ్గించడంలో సహాయకారి కాగలవు. భారతదేశం ఒక బలిష్టమైన, తక్కువ వ్యయంతో కూడిన మౌలిక సదుపాయాలను రూపొందించింది.

ఇవి భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎంతటి పరిమాణం కలిగిన డిజిటల్ లావాదేవీలను అయినా ఎంతో సౌలభ్యంతో చేపట్టేందుకు వీలు కల్పిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రూపే, యుపిఐలను ఉపయోగించేలా వాటి వినియోగదారులను క్రియాశీల రీతిన ప్రోత్సహించాలి. ఎమ్ఎస్ఎమ్ఇలకై అత్యవసర పరపతి మార్గం, అదనపు కెసిసి కార్డులు, ఎమ్ఎఫ్ఐ, ఎన్‌బిఎఫ్‌సిలకై లిక్విడిటీ విండో వంటి పథకాల పురోగతిని కూడాను సమీక్షించడమైంది. చాలావరకు పథకాలలో మహత్వపూర్ణ ప్రగతి సాధ్యపడిందని గమనించడం జరిగింది. కాగా బ్యాంకులు అపేక్షిత లబ్ధిదారులతో క్రియాశీల సంబంధాలను నెరుపుతూ, సంక్షోభ కాలంలో వారికి సరి అయిన వేళకు పరపతి సంబంధి సమర్థన అందేందుకు పూచీ పడటం కోసం మార్పు తటస్థించినప్పుడు ప్రతిచర్యలకు దిగే కంటే పరివర్తనకు నాంది పలుకుతూ ముందస్తు గానే చర్యలను చేపట్టే వైఖరిని అలవరచుకోవలసిన అవసరం ఉందని సూచించడమైంది.