న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన వాణిజ్య, వ్యాపార ఖాతాదారుల కోసం కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్ ట్రేడ్ ఫైనాన్స్ పోర్టల్‌ విశేషాలను చర్చించేందుకు న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో ఇటీవల ఎగుమతిదారుల సమావేశాన్ని నిర్వహించింది.

బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీహెచ్ఎస్ఎస్ మల్లికార్జునరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ డివిజన్ జనరల్ మేనేజర్ విభా అరేన్, కార్పొరేట్ జనరల్ మేనేజర్స్, బ్యాంక్ ఢిల్లీ జోన్ నుండి ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్న ఈ కీలక సమావేశానికి ఈ కార్యక్రమానికి ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన 65 మందికి పైగా ప్రముఖ ఎగుమతిదారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎండీ మల్లికార్జునరావు మాట్లాడుతూ పూర్వపు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పూర్వపు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విజయవంతంగా కలపడంపై ఖాతాదారులతో ప్రధానంగా చర్చించారు. సంస్థాగత నిర్మాణ మార్పులపై ఆయన ప్రస్తావిస్తూ రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ పూచీకత్తు సేవలను మెరుగుపరచడానికి ఫారెక్స్ కార్యకలాపాలు వంటి ముఖ్యమైన విభాగాల నిలువీకరణపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ట్రేడ్ ఫైనాన్స్ పునర్నిర్వచించడాన్ని, ఎగ్జిక్యూటివ్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించడం వంటి ఎగుమతిదారుల కోసం పీఎన్‌బీ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన విలువ ఆధారిత సేవలను మల్లికార్జునరావు వివరించారు. ఎగుమతి పత్రాలను నేరుగా సమర్పించడానికి పోర్టల్‌‌లో నిరంతర లభ్యత ప్రత్యేక లక్షణం ఉందని, ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్, తద్వారా ప్రక్రియలను వేగవంతం చేస్తుందనీ, టర్నరౌండ్ సమయాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు.

మరోవైపు, మునుపటి రెండు కేంద్రాల నుండి బ్యాంక్ తన ఫారెక్స్ ట్రేడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై అనే నాలుగు మెట్రోలకు విస్తరించింది. ఫారెక్స్ కార్యకలాపాల పోటీ ధర, కేంద్రీకరణ స్వదేశీ (భారతీయ) ఎగుమతిదారులకు వ్యాపారం చేయడం సులభతరం చేస్తుందని మల్లికార్జునరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం తరువాత ఒక శక్తివంతమైన ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. దీనిలో ఎగుమతిదారు క్లయింట్లు సమ్మేళనం నిర్వహించే విధానాన్ని ఆహుతులు ప్రశంసించారు.

కోవిడ్-19 మహమ్మారి విపత్కర పరిస్థితులు, కష్టాల మధ్య బ్యాంక్ నిరంతరాయంగా సేవలను అందిస్తున్న అంశంతో పాటు ఛానల్ ఫైనాన్సింగ్, ఎగుమతి ప్రతిపాదనల ట్రాకింగ్, ఫండ్ ఆధారిత కన్వర్టిబిలిటీ, ఎగుమతిదారులకు నాన్ ఫండ్ ఆధారిత పరిమితుల గురించి అనేక ఇతర సూచనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. పీఎన్‌బీ ఢిల్లీ జోన్ జనరల్ మేనేజర్ కె. మీనాక్షిసుందరం సమావేశంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.