చిన్నారుల మానసిక ఆరోగ్యానికి…

177
చిన్నారులలో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు గుడ్ కర్మ క్లినిక్‌లో నిర్వహించే శిక్షలో ఇదో భాగం
  • ‘గుడ్ కర్మ’తో చేతులు కలిపిన ‘పాప్‌కార్న్’

  • నాణ్యమైన సచేతన శిక్షణ దిశగా ప్రయత్నాలు

హైదరాబాద్, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున, భారతదేశంలోనే అతిపెద్ద విద్యా సంబంధిత ఉత్పాదక సంస్థ అయిన ‘పాప్‌కార్న్ స్కూల్ ఫర్నిచర్’ చిన్నారుల మానసిక సంక్షేమం మీద దృష్టి పెట్టే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొవిడ్-19 వ్యాప్తి ముమ్మరంగా ఉన్న ఈ తరుణంలో వర్క్‌షాప్‌లు, కార్యకలాపాల ద్వారా చిన్నారులలోని ఒత్తిడిని శాంతపరచడమే లక్ష్యంగా ‘గుడ్‌ కర్మ’ సహచర్యంతో ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించింది. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా పెద్దలలోనే కాకుండా చిన్నారులలో కూడా ఆందోళన, భయం అధిక స్థాయిలో పెరిగిపోతున్న సమయంలో చిన్నారులకు అధిక సంరక్షణ, సరైన మార్గదర్శకం అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో పాప్‌కార్న్ ఫర్నిచర్ అనుభవజ్ఞుల సూచనలతో చిన్నారులకు, అలాగే తల్లిదండ్రులకు పరోక్ష వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. తమ పిల్లల కోసం చదవడం, పెయింటింగ్, కుకింగ్, గేమ్స్, వారి సమయాన్ని ప్రయోజనాత్మకంగా గడిపేందుకు అమ్మమ్మ, నానమ్మ, తాతలతో పరస్పర సంభాషణా సెషన్ వంటి కొన్ని కార్యకలాపాలను ప్రణాళిక చేసేలా తల్లిదండ్రులు, సంరక్షకులకు అవగాహన కల్పిస్తారు. 20 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి, అమెరికన్ బోర్డ్ ద్వారా ధ్రువీకరణ పొందిన డాక్టర్ రంజన్ ఘోష్ ‘గుడ్‌ కర్మ’ క్లినిక్‌లో చిన్నారులు, తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఈ ప్రచారం ద్వారా, చిన్నారుల మానసిక సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా చిన్నారులను బిజీగా ఉంచుతూ, సృజనాత్మక కార్యకలాపాలను ఈ రెండు సంస్థల సమ్మేళనం నిర్వహిస్తుంది.

‘పాప్‌కార్న్ ఫర్నిచర్’ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ దీపికా గోయల్

‘గుడ్ కర్మ’తో కలిసి పనిచేయడం గురించి ‘పాప్‌కార్న్ ఫర్నిచర్’ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ దీపికా గోయల్ మాట్లాడుతూ ‘‘చిన్నారులలో శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, వారి మానసిక సంక్షేమం కూడా అంతే ముఖ్యం. ఈ లాక్‌డౌన్ పరిస్థితితో పోరాడేందుకు ఎదురొడ్డే శక్తిని అభివృద్ధి చేయడానికి చక్కటి మానసిక ఆరోగ్యం సహాయపడుతుంది. ఇంట్లోనే ఉంటూ, తమ సమయాన్ని ఖాళీగా వృధా చేయడానికి బదులు ఒక అర్ధవంతమైన నిర్మాణాత్మక విధానంలో ఈ సమయాన్ని చిన్నారులు ఉపయోగించడం ఎంతో ముఖ్యం. ఈ పరిస్థితితో పోరాడేందుకు అనుభవజ్ఞుల పర్యవేక్షణలో చిన్నారులు, వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి డాక్టర్ రంజన్ ఘోష్ ద్వారా అన్ని విధాల మానసిక సంరక్షణ, కౌన్సెలింగ్‌ అందించే గుడ్‌ కర్మతో మేము కలిసి పనిచేస్తున్నాము’’ అని అన్నారు.

ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ రంజన్ ఘోష్

‘గుడ్ కర్మ’ప్రమోటర్లలో ఒకరైన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ రంజన్ ఘోష్ మాట్లాడుతూ ‘‘మన నియంత్రణలో లేని బహిర్గత సంఘటన మన మానసిక ఆరోగ్యానికి కొంతమేరకు హాని కలిగిస్తుంది, దాని గురించి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు మనం భావిస్తే, అది ఇంకా అధ్వాన్నంగా తయారవుతుంది. పిల్లలు, పెద్దల మానసిక సంక్షేమాన్ని మెరుగుపరచేందుకు చేసిన పరిశోధనలో కనుగొన్న సంక్షేమానికి ఐదు మార్గాలను గుర్తు చేసుకోవడం అనేది మన మానసిక ఆరోగ్యం మీద నియంత్రణను తిరిగి పొంది, పెంపొందించగలిగేందుకు గల ఒక మార్గం. అవేంటంటే మీ ఇంటిలో ఉండే ఇతరులకు ఇవ్వడం, ఫోన్‌లో లేదా ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావడం, అవగాహన కలిగి ఉండడం, చురుగ్గా ఉండడం, నేర్చుకుంటూ ఉండడం. ఈ ఆందోళనకర, అనిశ్చిత పరిస్థితులలో ఈ ముఖ్యమైన సందేశాన్ని ప్రచారం చేసేందుకు ‘టీచ్ కరోనా’ చొరవ కోసం ‘పాప్‌కార్న్ ఫర్నిచర్‌’తో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు.

‘పాప్‌కార్న్ ఫర్నిచర్’లో అమ్మకానికి ఉంచిన స్కూల్ టేబుళ్లు

‘పాప్‌కార్న్ ఫర్నిచర్‌’ గురించి చెప్పుకోవాల్సి వస్తే, పాప్‌కార్న్ అనేది భారతదేశంలోనే అతి పెద్ద విద్యా సంబంధిత ఫర్నిచర్ కంపెనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, విద్యనందించే వారికి కావలసిన ఉపకరణాలన్నింటినీ ఒకే చోట అందించే దుకాణం. గత 20 సంవత్సరాలుగా ఒక విద్యా సంబంధిత సంస్థ అన్ని ఫర్నిచర్ సంబంధిత అవసరాలకు ఇది పరిష్కారాలను అందిస్తోంది. స్కూల్ ఫర్నిచర్‌లో శ్రేష్ఠత కోసం గానూ, ప్రపంచ ఉపదేశకుల నుండి రెండు ప్రశంసాత్మక అవార్డులను, 2018లో సిలికాన్ ఇండియా మ్యాగజైన్ వారి ‘బ్రాండ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న విజేత పాప్‌కార్న్. భారతదేశం, యుఎఇ, ఒమన్, నేపాల్, సింగపూర్, మాల్దీవులు, సౌదీ అరేబియా, ఆఫ్రికాలలోని 8000లకు పైగా పాఠశాలలకు ఫర్నిచర్‌ సప్లై చేస్తోంది. ప్రస్తుతం భారతదేశం, దుబాయి, కేప్‌టౌన్‌లలో ‘పాప్‌కార్న్ ఫర్నిచర్‌’కు సొంత షోరూంలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అత్యాధునిక అనుభవ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.

విస్తరిస్తున్న శ్రేణితో, పాఠశాలల కొరకు వన్ స్టాప్ షాప్‌గా పాప్‌కార్న్ ఎదిగింది. స్కూల్ ఫర్నిచర్‌ను ప్రత్యేకంగా రూపొందించడాన్ని, ఉత్పత్తి చేయడాన్ని ఆరంభించింది. మరిన్ని వివరాల కోసం https://www.popcornfurniture.com ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

చిన్నారులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకుల్లో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు గుడ్ కర్మ క్లినిక్‌లో నిర్వహించే శిక్షణ తరగతుల దృశ్యం

‘గుడ్ కర్మ’ గురించి చెప్పాల్సి వస్తే, పిల్లలు, పెద్దలు, వయోజనుల కోసం అమెరికన్ బోర్డ్ ధ్రువీకరణ చేసిన మానసికవైద్యులు డాక్టర్ రంజన్ ఘోష్‌ ద్వారా అన్ని విధాల న్యూరోసైన్స్‌లు, మెదడు సంక్షేమం, కౌన్సెలింగ్, ఔషథీయ నిర్వహణతో వ్యవహరించే ఒక అత్యాధునిక కేంద్రం గుడ్‌ కర్మ. స్టేట్స్‌లో ఎంతో ముందుగానే ఒక ఆలోచనగా ఇది రూపొందింది. ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి శరీరానికి మానసిక సంక్షేమం ఎంత ముఖ్యం అనే దాని మీద అవగాహనను రూపొందించే విజన్‌తో ‘గుడ్ కర్మ’ క్లినిక్ నడుస్తోంది. మానసిక ఆరోగ్య సంరక్షణకు సులువుగా ప్రవేశసౌలభ్యాన్ని అందించడంతో సమాజానికి సాధికారతను అందించడం, దానితో ముడిపడి ఉన్న మచ్చను రూపుమాపడం ‘గుడ్ కర్మ’ బాధ్యత. ఈ సంస్థ అందిస్తున్న సర్వీసుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు drranjanghoshmd.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.