కరోనా ప్రభావంతో స్థానిక ఎన్నికల వాయిదా

0
7 వీక్షకులు
మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు

ఏలూరు, మార్చి 15 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ ప్రభావం వల్ల ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ నుండి మండలస్దాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహణ ఆరు వారాలపాటు వాయిదా పడినందున ఇప్పటికి ఎన్నికల నిర్వహణ స్దితి ఏ విధంగా వుందో అదే విధంగా యదాతధంగా ఉంటుందని, ఎన్నికల సంఘం నుండి తదుపరి ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

ఎంపిటిసి, జడ్‌పిటిసిల ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ దాదాపు పూర్తయినందున వాటిని సీల్ చేసి ఏలూరు హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంకు తరలించి భద్రపర్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఏఒక్క మండలంలోనూ బ్యాలెట్ పేపర్లు ఉంచరాదని, అన్నింటిని స్ట్రాంగ్ రూంకు తరలించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలననుసరించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎక్కడా అతిక్రమణ జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారికి కేటాయించిన స్రాంతంలోనే వుండి బ్యాలెట్ పేపర్లను సీల్ చేయించి ఏలూరుకు పంపడంతోపాటు కౌంటింగ్ కేంద్రాలు పరిశీలించి తుదినిర్ణయం తీసుకోవాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి, జడ్‌పి సీఈవో పి. శ్రీనివాసులు, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రారెడ్ది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here