డబ్ల్యుూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం పీపీఈలు

0
5 వీక్షకులు

న్యూఢిల్లీ, మే 27 (న్యూస్‌టైమ్): కోవిడ్-19 మహమ్మారితో వ్యవహరించడానికి వీలుగా, భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కింద, ఒక ప్రధాన జాతీయ సంస్థ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) డబ్ల్యూహెచ్ఓ/ఐఎస్ఓ మార్గదర్శకాల ప్రకారం పీపీఈ, ఇతర సంబంధిత ఉత్పత్తుల తయారీ, ధృవీకరించడం వంటి ఆరోగ్య సంరక్షణ రంగాలలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) కార్యక్రమాలను చేపట్టింది.

క్యాబినెట్ సచివాలయం ఆదేశాల మేరకు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఆర్ & ‌డి కార్యక్రమాలను చేపట్టాలని సి.ఐ.పి.ఈ.టి.ని కోరినట్లు, సి.ఐ.పి.ఈ.టి. పేర్కొంది. తదనుగుణంగా, ఐ.ఎస్.ఓ./డబ్ల్యూ.హెచ్.ఓ. మార్గదర్శకాల ప్రకారం, పరీక్షలు, ప్రమాణాల ప్రయోగశాల జాతీయ ధ్రువీకరణ బోర్డు (ఎం.ఏ.బి.ఎల్.) ధ్రువీకరణ కోసం భువనేశ్వర్, చెన్నై, లక్నోలలో సి.ఐ.పి.ఈ.టి. చెందిన మూడు ప్లాస్టిక్ సాంకేతిక కేంద్రాలు (ఐ.పి.టి.లు) త్వరలో సిద్ధం కానున్నాయి.

ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, కార్మికులు, పోలీసు సిబ్బంది మొదలైన వారు ‘కరోనావైరస్’కు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన రక్షణ పరికరం – ఫేస్ షీల్డ్‌ను మూర్తల్‌లోని నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక మద్దతు కేంద్రం (సి.ఎస్.టి.ఎస్.) అభివృద్ధి చేసింది. జైపూర్‌లోని సి.ఎస్.టి.ఎస్., లక్నోలోని ఐ.పి.టి., మధురైలోని సి.ఐ.పి.ఈ.టి, సి.ఎస్.టి.ఎస్ సంస్థలు ఫేస్ షీల్డ్‌ను అభివృద్ధి చేశాయి. ఫ్రేముల ఉత్పత్తి కొనసాగుతోంది.

పరిపాలనా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అవసరమైన సేవలకు తోడ్పడటానికి ఆహార ధాన్యం ప్యాకేజింగ్‌ను పరీక్షించే సామర్థ్యాన్ని సి.ఐ.పి.ఈ.టి. విస్తరించింది. అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తొమ్మిది మంది సభ్యుల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా సాంకేతిక సహాయాన్ని అందించడానికి వీలుగా పరిశ్రమకు ఆన్‌‌లైన్ శిక్షణా కార్యక్రమాలు, పరిశ్రమ వద్దకే సేవలను అందించే కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా, సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ, కనీస సిబ్బందితో మూడు షిఫ్ట్ ల ప్రాతిపదికన నడపాలని ప్రతిపాదించడం జరిగింది.

కోవిడ్-19 మహమ్మారి దుస్థితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రధానమంత్రి కెర్స్ నిధికి మరియు స్థానిక సంస్థ/మునిసిపల్ కార్పొరేషన్/రాష్ట్ర ప్రభుత్వ అధికార సంస్థలకు సహకరించడం ద్వారా సి.ఐ.పి.ఈ.టి. సమాజ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు నిచ్చింది. సి.ఐ.పి.ఈ.టి.లోని ఉద్యోగులందరూ కలిసి ఒక రోజు జీతం, సుమారు 18.25 లక్షల రూపాయలను ప్రధానమంత్రి కెర్స్ నిధికి విరాళంగా అందజేశారు. కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో, భారత ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా బాధితులు, వలస కార్మికులు ఎదుర్కొంటున్న దుస్థితిని తగ్గించడానికి, సంబంధిత అధికారుల అనుమతితో సి.ఐ.పి.ఈ.టి. ఇంత వరకు వివిధ స్థానిక సంస్థలు/మునిసిపల్ కార్పొరేషన్లు/రాష్ట్ర ప్రభుత్వానికి 85.50 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here