కరోనా వారియర్స్‌కు పీపీఈలు

0
8 వీక్షకులు
వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను పంపిణీ చేస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు, ఏప్రిల్ 18 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ నియంత్రణలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన 200 వ్యక్తి గత సంరక్షణ కిట్లు ఎఫెక్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.వి.మోహన్ రావు రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. శనివారం స్థానిక స్పందన హాలులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి వీటిని అందజేశారు.

మార్టూరుకు చెందిన సేవా సంస్థ వైద్యుల కోసం అత్యంత విలువైన సంరక్షణ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here