సామాజిక దూరం పాటించండి: కలెక్టర్

0
12 వీక్షకులు

చిత్తూరు, మార్చి 25 (న్యూస్‌టైమ్): ప్రజలందరూ సామాజిక బాధ్యత తో సామాజిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రజలకు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుండే జిల్లా కలెక్టర్ చిత్తూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేసి పారిశుధ్య నిర్వహణ, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఆ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా వేలూరు రోడ్‌లో గల రైతు బజార్ చేరుకుని అక్కడ పరిస్థితులు పరిశీలిస్తూ రైతు బజార్‌కు వచ్చే ప్రజలు గుంపులు గుంపులుగా కూరగాయల నిమిత్తం రాకుండా 10 మందికి మించకుండా వచ్చిన ప్రజల మధ్య కనీసం 3 అడుగులు దూరం ఉండేలా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, రైతు బజార్‌లో పారిశుధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని ఎస్టేట్ అధికారిని ఆదేశించారు. అనంతరం గిరింపేట్‌లోని నారాయణ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసారు.

పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవు ప్రకటించినప్పటికీ పాఠశాల సిబ్బంది విధులకు హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి పాఠశాలను తాత్కాలికంగా మూసివేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేశు, చిత్తూరు తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here