కరోనాపై తెలంగాణ పోరుకు ప్రశంసలు

0
4 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరొక నేతృత్వంలోని కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణపై చేపట్టిన పోరాటాన్ని మెచ్చుకుంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా బృందం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ముందుగా కోవిద్-19 కంట్రోల్ రూం పనితీరును తనిఖీ చేసింది. కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్న విధులు గురించి ఓఎస్‌డి అనురాధ వివరించారు. దీనిపై కేంద్ర బృందం పలు అంశాలపై ప్రశ్నించి, అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ర్యాండంగా ఫోన్ చేయించి ధ్రువీకరించుకున్నారు.

వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు గురించి, వారి నుండి కంట్రోల్ రూమ్‌కు వస్తున్న కాల్స్ గురించి, అన్నపూర్ణ మొబైల్ కేంద్రాల ద్వారా ఏ విదంగా టై అప్ చేసి రెగ్యులర్‌గా భోజనం పెడుతున్నారు? ఏ ఏ శాఖలు, జిల్లాలతో సమన్వయము చేసుకుంటున్నారనే వివరాలు తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆహారం పంపిణీ చేసిన వారి వివరాలు, ఎంత మందికి ఆహారం అందింది అనే వివరాలు తెలుసుకున్నారు. మూడు షిఫ్టులలో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. అత్యవసర సేవలు అందించుటకు 32 అంబులెన్సులను జోనల్ కమిషనర్ కార్యాలయాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విదేశాల నుండి వచ్చి ఇక్కడ హోటల్స్‌లో ఉంటున్న వారిని పర్యాటక అధికారి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111కు వచ్చిన ప్రతి కాల్‌ను రిజిస్టర్‌లో నమోదుచేసి స్పందిస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్‌కు ఏడు లైన్స్ ఉన్నట్లు తెలిపారు.

అనుమానిత కేసులపై తదుపరి చర్యల నిమిత్తం సర్కిల్ కార్యాలయాలకు పంపుతున్నట్లు తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారు, హోం క్వారంటైన్‌లో ఉంచిన వారి ఆరోగ్య స్థితిపై ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కరోనా నేపద్యంలో మంత్రులు, జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాల విడియోలను కేంద్ర కమిటీ సూచింది. పారిశుద్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సేవలను అభినందిస్తు మంత్రి కేటీఆర్ వారితో భోజనం చేసిన వీడియోలను చూసి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here