ఆసెట్ నోటిఫికేషన్‌కు సిద్ధం

0
6 వీక్షకులు
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి
  • జూలై నుంచి పరీక్షల నిర్వహణ

విశాఖపట్నం, మే 18 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను వారం రోజుల్లో విడుదల చేస్తామని వైస్ చాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రగతికి, సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందన్నారు.

జూలై మెదటి వారం నుంచి డిగ్రీ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పీజీ ద్వితీయ సంవత్సరం పరీక్షలను జూలై 1 నుంచి 15వ తేదీ వరకు, ప్రధమ సంవత్సరం పరీక్షలను జూలై 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంజననీరింగ్ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈ నెల 25న విడుదల చేస్తామని, మిగిలిన పరీక్షలను జూలై, ఆగష్టు మాసాల్లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ తృతీయ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జూలై మాసంలోను, ప్రధమ సంవత్సరం పరీక్షలు ఆగష్టు మాసంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఆగష్టు 1 నుంచి పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఆసెట్ ప్రవేశాలు పూర్తిచేసి సెప్టెంబరు 1 నుంచి ప్రధమ సంవత్సరం తరగుతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో ఆయా కోర్సుల విద్యార్థులను మాత్రమే హాస్టల్‌లో అనుమతిస్తామన్నారు.

తద్వారా భౌతిక దూరం పాటించడానికి సాధ్యపడుతుందన్నారు. ఇప్పటికే పరీక్షల విభాగం అధికారులతో తాత్కాలిక టైంటేబులను సైతం సిద్ధం చేయాలని సూచించామన్నారు. పరిస్థితులకు అనుగునంగా అవసరమైన మార్పులు చేసి పరీక్షల నిర్వహణ జరపడం సాధ్యపడుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం విద్యార్థులు ఏయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here