న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్‌టైమ్): మహమ్మారి కరోనా విపత్తు కల్లోలంలోనూ దేశంలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణంలో పురోగతి చోటుచేసుకుంది. బియ్యం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనెగింజల సాగు గతేడాది కంటే అధికం రబీ మార్కెటింగ్‌ సీజన్‌-2020-21లో 389.75 ఎల్‌ఎంటీల గోధుమలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కొనుగోలుచేసింది. కరోనా సమయంలో వ్యవసాయ పనులు ఆగకుండా, కేంద్ర వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ రైతు సౌలభ్య చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల, ఖరీఫ్‌ పంటల సాగు విస్తీర్ణంలో సంతృప్తికర పురోగతి కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో ఈ ఏడాది 220.24 లక్షల హెక్టార్లలో వరి పండిస్తున్నారు.

గతేడాది ఇదే కాలంలో 187.70 లక్షల హెక్టార్లలో సాగయింది. ఈ ఏడాది 99.71 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు పండిస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో 79.30 లక్షల హెక్టార్లలో సాగయింది. గతేడాది ఇదే సమయంలో సాగుచేసిన 120.30 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ఈ ఏడాది 137.13 లక్షల హెక్టార్లలో తృణధాన్యాలు పండిస్తున్నారు. అలాగే, గతేడాది ఇదే సమయంలో సాగుచేసిన 133.56 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ఈ ఏడాది 166.36 లక్షల హెక్టార్లలో నూనె గింజలు పండిస్తున్నారు. ఈ ఏడాది 51.54 లక్షల హెక్టార్లలో చెరకు పండిస్తుండగా, గతేడాది ఇదే సమయంలో ఇది 51.02 లక్షల హెక్టార్లుగా ఉంది.

ఈ ఖరీఫ్‌లో 6.94 లక్షల హెక్టార్లలో ఇవి సాగవుతున్నాయి. గత ఖరీఫ్‌లో ఇది 6.84 లక్షల హెక్టార్లు. పత్తిని ఈ ఏడాది 118.03 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో ఈ విస్తీర్ణం 96.35 లక్షల హెక్టార్లు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లోని 123 జలాశయాల్లో ప్రస్తుతమున్న నీటి నిల్వ, గత సంవత్సరం ఇదే సమయానికంటే 155 శాతం అధికమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదించింది. కాగా, రబీ మార్కెటింగ్‌ సీజన్‌-2020-21లో, 420.90 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు భారత ఆహార సంస్థ గోదాములకు రాగా, వీటిలో 389.75 లక్షల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసింది.