ప్రజాప్రతినిధులకు చిత్తూరు జడ్పీ సమావేశంలో స్వాగతం

91

చిత్తూరు, జూన్ 23 (న్యూస్‌టైమ్): చిత్తూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె. నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎం.పి రెడ్డప్పలకు పూర్ణకుంభంతో జిల్లా ప్రజా పరిషత్ తరపున ఘనస్వాగతం లభించింది.

తొలుత జిల్లా ప్రజా పరిషత్ ఆవరణలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రులు అనంతరం సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పుష్పగుచ్చంతో జిల్లా పరిషత్ చైర్మన్ గీర్వాణి స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాకు పుష్పగుచ్చంతో చైర్మన్ సాదర స్వాగతం పలికి సత్కరించారు. ఎం.ఎల్.సిలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు, యండవల్లి శ్రీనివాసులుకు, కొత్తగా ఎన్నికైన పీలేరు, తంబల్లపల్లి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, శ్రీకాళహస్తి, సత్యవేడు శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాధరెడ్డి, నవాజ్ బాషా, వెంకటేగౌడ్, ఎ.శ్రీనివాసులు, ఎం.ఎస్.బాబు, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం శేఖర్‌కు కూడా జడ్పీ పాలక మండలి స్వాగతం పలికింది.