రైతుల మేలుకోరి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు

0
11 వీక్షకులు

నిజామాబాద్, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం పచ్చల్ నడ్కుడ గ్రామంలో శుక్రవారం వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కార్డులు లేని నిరుపేదలకు గ్రామపంచాయతీ దగ్గర బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కరోనా వైరస్ ప్రభావం వల్ల రైతులు మార్కెట్ యార్డ్‌కు వెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించు కోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాలకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు వరి ధాన్యం సేకరించడం జరుగుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర మొత్తం 3800 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈ సంవత్సరం 6800 కేంద్రాలు చేయడం జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో గత సంవత్సరం 310 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈ సంవత్సరం 547 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో గత సంవత్సర 74 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈ సంవత్సరం 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు‌. కరోనా వ్యాధి ఉన్నందువలన సామాజిక దూరం పాటించాలి అని తెలిపారు. 25 వేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీ తీసుకొని మార్కు ఫెడ్ ద్వారా వరి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైస్ మిల్లర్స్ సమస్య, గన్ని బ్యాగుల సమస్య ఈ రెండింటిని కూడా తొందరలోనే పరిష్కరిస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత మటుకు అన్నిరకాలుగా సజావుగా జరిగేటట్టు చేయబడుతుందని రైతులు ఓపిక పట్టాలి ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాము కాబట్టి రైతులు కూడా సహకరించాలి అని తెలిపారు. భారతదేశంలో మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 100% వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.

ఎంత కష్టమైనా నష్టమైనా రైతు బాగుండాలి రైతు బాగుంటేనే సమాజం మొత్తం బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటూ ఉంటారు స్వయానా ఆయన రైతు కాబట్టి రైతు బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి 90 శాతం తెలంగాణ రాష్ట్రంలో పండే పంటలు వరి, మొక్కజొన్న దక్షిణ తెలంగాణలో పండే పత్తి ముఖ్యమంత్రి గారుకొనాలని నిర్ణయం తీసు కోవడం జరిగిందని రైతులు కూడా ప్రభుత్వానికి, సొసైటీలకు సహకరించాలి క్రమశిక్షణతో ఈ కరోనా గైడెన్స్ పాటించి సామాజిక దూరం పాటించాలి అన్నారు. రైతులందరి ధాన్యాన్ని చివరి కిలో వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here