ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటుచేసిన వివిధ గ్రేడుల పామాయిల్ విత్తనాలను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): అశ్వారావుపేట నియోజకవర్గం అప్పారావుపేట గ్రామంలోని పామాయిల్ ఫ్యాక్టరీని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. వివిధ విభాగాలను ఆయన తిరిగి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం రైతుల సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్పామ్ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సీడీలు అందిస్తోందని తెలిపారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్లపైన రాయితీలు ఉన్నాయని వాటిని వినియోగించుకుని ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. పామాయిల్ సాగును సీఎం కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేట, దమ్మపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాలు, తోటల విస్తరణ జరిగిందన్నారు. భద్రాద్రి జిల్లాలో 33వేల 812 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 6845 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల 872 ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతుందని అన్నారు.

ఆయిల్ఫామ్ సాగుతో రైతుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. దేశంలో నూనె ఉత్పత్తులలోటు ఉందని, ఆయిల్ఫెడ్ ద్వారా తోటలు వేయించడం, మార్కెటింగ్, చెల్లింపులు, రవాణా చార్జీలు, క్రష్షింగ్, విజయ ఆయిల్స్ ద్వారా నూనెను తిరిగి అమ్మడం ఆయిల్ఫెడ్ ద్వారా జరుగుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో ఆయిల్ఫాం విస్తరించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పామాయిల్ తోటలు వేసిన వారికి ఉద్యానవనం, ఆయిల్ఫెడ్ సహకారం అందిస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేట, దమ్మపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాలు, తోటల విస్తరణ జరిగిందన్నారు. ఆయిల్పామ్ సాగుతో రైతుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు.తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ విస్తరించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయిల్ ఉత్పత్తులకు దేశంలో మంచి డిమాండ్ ఉందని, 130 కోట్ల జనాభాకు 21 మెట్రిక్ టన్నుల నూనె అవసరముండగా దేశీయంగా 7లక్షల మెట్రిక్ టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. ఇంకా 15మెట్రిక్ టన్నుల నూనె లోటును లక్షల కోట్ల వెచ్చించి విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అందువల్ల రైతులు నిస్సందేహంగా పామాయిల్ తోటలు వేసుకొని లాభాలను ఆర్జించవచ్చునన్నారు.

తెలంగాణలో పామాయిల్ తోటల విస్తరణలో భాగంగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం పామాయిల్ రైతులకు అండగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, ఆయిల్ ఫెడ్ మేనేజర్‌లు శ్రీకాంత్ రెడ్డి (అప్పరావుపేట), బాలకృష్ణ (అశ్వారావుపేట), డివిజన్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి జీనుగు మరియన్న, మండల అధికారి సందీప్ తదితరులు ఉన్నారు.

31 COMMENTS

 1. [ SEO – BACKLİNK – HACKLİNK – BLACK OR WHİTE HAT ]
  – – – – – – – – – – – – – – – –

  1- Senin için yorum backlink yapabilirim.

  2- I can comment backlink for you.

  3- Ich kann den Backlink für Sie kommentieren.

  4- Я могу прокомментировать обратную ссылку для вас.

  [ SEO – BACKLİNK – HACKLİNK – BLACK OR WHİTE HAT ]

  – – – – – – – – – – – – – – – –

  WhatsApp = +9 0422 606 06 30
  Mail = Seo.Backlink.44@gmail.com

  Google Search = Seo Bayi
  seo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here