ఖమ్మం కరోనా బాధితుడికి గాంధీలో క్వారంటైన్

0
5 వీక్షకులు

ఖమ్మం, ఏప్రిల్ 16 (న్యూస్‌టైమ్): ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో బాధితుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి క్వారెంటైన్‌కు తరలించింది జిల్లా యంత్రాంగం. ఆయా ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్ జోన్‌గా పరిగణించిన విషయం విధితమే. స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెద్దతండాలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకై ప్రభుత్వ నిబంధనలను పాటించి సహకరించాలని కోరారు.

నిత్యావసర సరుకులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు ద్వారా సరుకులు తీసుకొచ్చి బుస్సునే కిరాణ దుకాణంగా మార్చమని వివరించారు. ఇప్పటికే ప్రతి మనిషికి 12 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేయగా, ప్రభుత్వ అందిస్తున్న రూ.1500 రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తున్నట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించామని, పరిస్థితి అడుపులోనే ఉందని, నిత్యం గ్రామంలో బ్లీచింగ్, హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. ఏప్రిల్ 30 వరకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని సరుకులు మీ వద్దకే వస్తాయని ఎలాంటి పరిస్థితులలో ప్రజలు ఇళ్ళు వదిలి బయటకు రావొద్దని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, వార్డ్ ప్రత్యేక అధికారి పరంధామ రెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here