ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌గా రమణమూర్తి

575

విశాఖపట్నం, జులై 2 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య కె.వి రమణమూర్తి నియమితులయ్యారు. ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు తన కార్యాలయంలో ఉత్తర్వులు అందజేసి అభినందించారు. ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఆచార్య రమణ మూర్తిని ఫార్మశీ కళాశాల ఆచార్యులు, పరిశోధకులు అభినందించారు.