రాజకీయాల్లోకి రంగమ్మత్త!

0
5 వీక్షకులు

‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి.

ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అనసూయ భరద్వాజ్ పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ తన దృష్టిని రాజకీయాలపై మళ్లించబో తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతో పాటు పలు పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరమని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతలు అనసూయతో చర్చలు జరిపినట్టు తెలిసింది. కానీ అనసూయ మాత్రం రాజకీయ అరంగేట్రంపై తన సన్నిహితులతో చర్చిస్తోందట. ఇపుడిపుడే రాజకీయాలు వద్దు అన్నట్టు ఆమె సన్నిహితులు సూచించినట్లు భోగట్టా.

ప్రస్తుతం అనసూయ కెరీర్ మూడు హిట్లు.. ఆరు అఫర్లు అన్నట్లు సాగుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయాల్లో అడుగు పెట్టి ఎటూ కాకుండా పోతే… తర్వాత పరిస్థితి ఏమిటనే విషయమై ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అనసూయ తన రాజకీయ ఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక అనమాయ ‘రంగస్థలం’ సినిమాలో రాజకీయ నేతగా కనిపించిన సంగతి తెలిసిందే కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here