తిరుచ్చిపై కల్యాణ వెంకన్న అభయం

99

తిరుపతి, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): సూర్యజయంతిని పురస్కరించుకొని శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు శ‌నివారం ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి, తోమాల‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, అర్చ‌న నిర్వ‌హించారు. అనంత‌రం ఉదయం 6.30  నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.

కాగా సాయంత్రం 6.30 నుండి 7.30 బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఎల్ల‌ప్ప‌, ఏఈవో తిరుమ‌ల‌య్య, సూప‌రింటెండెంట్ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్త‌లు పాల్గొన్నారు.