‘క్రాక్’ చిత్రంలో పోలీస్ పాత్రలో రవితేజ

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రధానపాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘క్రాక్’. కరోనా లాక్‌డౌన్ అనంతరం దాదాపు 9 నెలల తర్వాత పెద్ద హీరో నటించిన చిత్రం నేరుగా థియేటర్స్‌లో విడుదలైంది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని క్రాక్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన హాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో రవితేజ పోలీసు పాత్రలో పోతరాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రిలీజై మంచి టాక్‌నే సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్‌ రివ్యూలో పేర్కొన్నారు. విక్రమార్కుడు తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించినట్టు ఆడియన్స్ పేర్కొంటున్నారు. రవితేజ, శృతి హాసన్‌తో రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయట. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డైగా మారిపోయింది. అప్పట్లో వరస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు బలుపు సినిమాతో చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోవైపు కొత్త ఏడాదిలో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల మందుకు వస్తోన్న మొదటి చిత్రం రవితేజ ‘క్రాక్’.

రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డైగా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు. కొత్త ఏడాది కానుకగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ పోతరాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ నటించారు. ఈ సినిమా యూఎస్ సహా పలు ప్రాంతాల్లో రిలీజై మంచి టాక్‌నే సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్‌ రివ్యూలో పేర్కొన్నారు. విక్రమార్కుడు తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించినట్టు ఆడియన్స్ పేర్కొంటున్నారు.

చాలా ఏళ్ల తర్వాత రవితేజ నటించిన సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమాలో రవితేజ విలన్స్ మధ్య సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట. విలన్స్‌తో ఇంట్రాక్షన్ పోరాటాలు హైలెట్ అని పేర్కొంటున్నారు. రవితేజ, శృతి హాసన్‌తో పాటు మిగతా హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయట. మొత్తంగా ట్విట్టర్‌లో ఎక్కువగా రవితేజ ‘క్రాక్’ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అసలు టాక్ ఏంటో తెలియాంటే ఇంకొన్ని గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

2020 మొదట్లో సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్‌లో నడిచిందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్, మహేష్ బాబు వారి టార్గెట్‌ను చాలా సులువుగా అందుకున్నారు. ఇక నితిన్ భీష్మ సినిమాతో ఎండింగ్ టచ్ ఇచ్చినట్లయ్యింది. ఆ తరువాత కరోనా రావడంతో బాక్సాఫీస్ రికార్డుల మజా మిస్సయ్యింది. ఇక ఈ సంక్రాంతికి అందరి చూపు ఎక్కువగా రవితేజ సినిమాపైనే ఉంది. ఆ సినిమా తెలుగు స్టేట్స్ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. మాస్ మహారాజా రవితేజ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులను అందుకోవడం లేదు. ఎంత డిఫరెంట్‌గా చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. చివరగా రాజా ది గ్రేట్ తరువాత మళ్ళీ విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం క్రాక్ అనే చెప్పాలి. ఈ సినిమాపై అభిమానుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రాక్ సినిమాను గత ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాల్సింది. కానీ లాక్‌డౌన్ వల్ల లేటుగా వదలారు. ఈ చిత్రాన్ని మొదట జనవరి 14న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, జనాలు థియేటర్స్‌కు బాగానే అలవాటు పడ్డారని ముందుగా విడుదల చేసి పాజిటివ్ టాక్‌తో సంక్రాంతి కలెక్షన్స్‌ను టార్గెట్ చేసినట్లు అర్ధమయ్యింది.

ఇక సినిమా తెలుగు రాష్ట్రల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే కొన్ని చోట్ల అయితే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. నైజాం ఏరియాలో రవితేజకు మార్కెట్ గట్టిగానే ఉంది. ఇక్కడ రూ.4.2కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో అయితే 2.8కోట్ల వరకు ధర పలికింది. ఎక్కువగా ఆంధ్రలో 6కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. సరైన ఫెస్టివల్ లో విడుదలవుతున్న ఈ సినిమాకు మొదటి 7రోజులు చాలా కీలకం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ప్రకారం టార్గెట్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. 13.5కోట్ల వరకు రబట్టగలిగితే బ్రేక్ ఈవెన్ సాదించినట్లే. ఈ టార్గెట్ అందుకోవడం మాస్ రాజాకు పెద్ద కష్టమేమీ కాదు. పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 25కోట్ల వరకు మొదటి వారంలోనే రాబట్టగలదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here