22న నరసరావుపేటలో రాయపాటి నామినేషన్

205

గుంటూరు, మార్చి 19 (న్యూస్‌టైమ్): నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనునట్లు ఎంపీ రాయపాటి సాంబశివరావు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నరసరావుపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా  జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తునామని రాయపాటి కోరారు.

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నుండి తన కుమారుడు రాయపాటి రంగారావు పోటీలోలేరని ఆయన స్పష్టం చేసారు. మద్దాలి గిరి గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తున్న గిరికి ఇప్పటికే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం కేటాయించారని, ఆయన అభ్యర్ధిత్వాన్ని తమ కుటుంబం కూడా బలపరుస్తుందని రాయపాటి పేర్కొన్నారు. పైగా వ్యాపారపరంగా మద్దాలి గిరితో తమకు ఎప్పటి నుండో సానిహిత్యం ఉందని రాయపాటి తెలిపారు.