హైదరాబాద్, జులై 25 (న్యూస్‌టైమ్): తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను సచివాలయంలో కలసిన ఆర్.ఏం.పి, పి.ఏం.పి. సంఘాల ప్రతినిదులు కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో తాము కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖకు పూర్తి మద్దతు తెలుపుతామని తెలిపారు. గతంలో నిమోనియ, లెప్రసి, టీకాలు, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలు వియవంతం కావడానికి సహకారం అందించామని, ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి సంసిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రజాల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళం ఇప్పుడు ప్రజల భద్రత కోసం పనిచేస్తామని తెలిపారు. విపత్తులో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కలిపించాలని కోరారు. దీనికి మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని సంఘం ప్రతినిధులు తెలిపారు.

కరోనాకి ఎంత త్వరగా వైద్యం మొదలు పెడితే అంతా త్వరగా కొలుకుంటున్నారని, ఆలస్యం ప్రాణాలమీదకు తెస్తుందని మంత్రి సూచించారు. జ్వరం లక్షణాలు ఉన్నవారు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవారు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటివారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని గుర్తుచేశారు. ముందుగా గుర్తిస్తే అతి తక్కువ ధరగల మందులతో కరోనా చికిత్స అందించగలమన్నారు. ఆ మందులు కూడా ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న అజిత్రోమైసిన్, విటమిన్ టాబ్లెట్ల ఉపయోగిస్తే సరిపోతుందని, ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మందుల దుకాణంలో అందుబాటులో ఉంటాయని, అనవసరంగా భయపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టవద్దని మంత్రి సూచించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో తెలంగాణ RMP, PMP, COMMUNITY PARAMEDICS & EXPERIENCED PRACTITIONERS SANGHAM ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కార్యదర్శి శివరాజ్, తెలంగాణ కమ్యూనిటి పారామెడికలు వైద్యుల ఐక్యవేదిక ప్రెసిడెంట్ అశోక్, సెక్రెటరీ నవీన్ పాల్గొన్నారని RMP, PMP సంఘాల ప్రతినిధులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here