న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): గత 24 గంటలలో 36.7 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసులివ్వటం ద్వారా ఒక్క రోజులో అత్యధిక టీకాలతో భారతదేశం మరో మైలురాయి దాటింది. టీకాల కార్యక్రమం మొదలైన 76వ రోజైన 36,71,242 డోసుల టీకాలు ఇవ్వగా అందులో 33,65,597 మంది లబ్ధిదారులు 51,215 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 3,05,645 మంది రెండో డోస్ అందుకున్నారు.

ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్నిబట్టి 11,37,456 శిబిరాల ద్వారా 6,87,89,138 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 83,06,269 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 52,84,564 డోసులు వారికిచ్చిన రెండో డోసులు, 93,53,02 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 40,97,634డోసులు వారికిఒచ్చిన రెండో డోసులు, 97,83,615 డోసులు 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకిచ్చిన మొదటి డోసులు, 39,401డోసులు వారికిచ్చిన రెండో డోసులు, 3,17,05,893 డొసులు 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు, 2,18,741 రెండో డోసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ డోసులలో 59.58% కేవలం 8 రాష్ట్రాలలో ఇచ్చినవే కాగా మహారాష్ట్రలోనే అత్యధికంగా 9.48% డోసులు తీసుకున్నారు.

రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 8 రాష్ట్రాలలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో దాదాపు 81.25% వాటా ఈ రాష్టాలదే కావడం గమనార్హం. గడిచిన 24 గంటలలో 81,466 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 43,183 కేసులు, చత్తీస్‌గఢ్‌లో 4,617 కర్నాటకలో 4,234 కేసులు వచ్చాయి. భారత దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 6,14,696 కాగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 5%.

గత 24 గంటలలో కొత్తకేసులు, డిశ్చార్జ్ అయినవారిని లెక్కలోకి తీసుకున్నప్పుడు నికరంగా చికిత్సలో ఉన్న 30,641 కేసులు పెరిగాయి. చికిత్సలో ఉన్న కేసులు ఐదు రాష్ట్రాలు. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్, కేరళ, పంజాబ్ కలసి 77.91% వాటా ఉండగా మహారాష్ట్రలోనే 59.84% కేసులున్నాయి. భారతదేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారు 1,15,25,039 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 93.68%. మరోవైపు, గత 24 గంటలలో 50,356 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

గత 24 గంటలలో నమొదైన కోవిడ్ మరణాలలో 83.16% ఆరు రాష్ట్రాలలోనే నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 249 మంది, పంజాబ్‌లో 58 మంది చనిపోయారు. గత 24 గంటలలో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఒడిశా, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షదీవులు, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఆ ఘనత సాధించిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.