న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్‌టైమ్): కోవిడ్-19 రోగుల అత్యధిక సింగిల్ డే రికవరీల ధోరణి నిరంతరాయంగా కొనసాగుతోంది. వరుసగా మూడవ రోజు, గత 24 గంటల్లో, 34,602 మంది రోగులు కోలుకోవడంతో మరో అత్యధిక రికార్డు నమోదైంది. దీంతో ఇంతవరకు మొత్తం కోలుకున్న కోవిడ్ రోగుల సంఖ్య 8 లక్షలు దాటి, ప్రస్తుతం 8,17,208కి చేరుకుంది. కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు 63.45 శాతానికి చేరుకోవడానికి ఇది బలంగా తోడ్పడింది. ఫలితంగా, కోలుకుంటున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు, చికిత్స అనంతరం కోలుకున్న వ్యక్తులు (ఈ రోజు 4,40,135) మధ్య వ్యత్యాసం మరింత విస్తరించి 3,77,073గా నమోదయ్యింది. ఈ వ్యత్యాసం క్రమంగా పైకి పెరుగుతున్న ధోరణి కనబడుతోంది. రాష్ట్ర, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వ్యూహాత్మక చర్చల ద్వారా, ఎక్కువ కేసులు నమోదౌతున్న ప్రాంతాలకు పంపిన నిపుణుల కేంద్ర బృందాల ద్వారా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నాలు మరింతగా బలపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికుల అంకితభావంతో, రికవరీలు మెరుగుపడుతున్నాయి.

కేసు మరణాలు నిరంతరం పడిపోతున్నాయి, ప్రస్తుతం ఇది 2.38 శాతంగా నమోదయ్యింది. కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు చక్కగా రూపొందించి, అమలు చేసిన వ్యూహం, రికవరీల సంఖ్య నిరంతరం పెరగడానికి దోహదపడుతోంది. ఇంటింటి సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎస్.ఏ.ఆర్.ఐ./ఐ.ఎల్.ఐ. కేసుల పర్యవేక్షణతో పాటు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తుగా వ్యాధిని గుర్తించడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతోంది. మూడు అంచెల ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులలో ప్రామాణిక వైద్య విధానాలు అమలుచేయడం, సమర్ధవంతమైన కట్టడి ప్రణాళికలు, సమర్థవంతమైన చికిత్స విధానాలు కూడా వీటికి తోడ్పడుతున్నాయి. ఇళ్ళల్లో ఐసోలేషన్, ఆసుపత్రులలో సమర్థవంతంగా చికిత్స చేయడంలో ఇవి విజయవంతంగా సహాయపడుతున్నాయి, తద్వారా క్లిష్టమైన రోగులకు ఆస్పత్రులు భారం కాకుండా ఉంటాయి. ల్యాబ్ మౌలిక సౌకర్యాలు వేగవంతంగా పెరగడంతో పరీక్షలు, శోధన, చికిత్స వ్యూహం మరింత ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.5 కోట్ల నమూనాలకు పరీక్షలు జరిపారు. దీంతో ఇంత వరకూ పరీక్షించిన కోవిడ్ నమూనాలు 1.5 కోట్లు దాటింది (1,54,28,170).

గత 24 గంటల్లోనే 3,52,801 నమూనాలను కోవిడ్ గుర్తింపు కోసం పరీక్షించారు. దీని ప్రకారం ప్రతి మిలియన్ మంది (టిపిఎం)లో 11,179.3 మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నట్టు తేలింది. ఈ వ్యూహాన్ని అమలు చేయడం వల్ల పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూవస్తోంది. క్రమంగా ల్యాబ్‌ల సంఖ్య (ఇప్పటి వరకు 1290) పెరగడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలితప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాల వల్ల పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్‌టి-పిసిఆర్ ల్యాబ్‌లు ఐసిఎంఆర్ సూచించిన తాజా పరీక్షా వ్యూహానికి కీలకంగా పని చేసాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ల్యాబ్‌ల సంఖ్య గతిశీలంగా వృద్ధిని సాధిస్తున్నాయి.

కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో కోవిడ్ సంక్రమణ నివారణ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా పత్రికా-ప్రసార మాధ్యమాలకు నగరపాలన యంత్రాంగాధిపతి విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా ప్రభుత్వం జారీచేసే ప్రకటనలు, సందేశాలు మాత్రమే సరిపోవని ఆయన పేర్కొన్నారు. ఈ త్రిముఖ నగరంలో మాస్కు ధారణ, సామాజిక దూరం పాటించడంపై ప్రజలలో అవగాహన కల్పనకు సానుకూల-చురుకైన పాత్ర పోషించాలన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఏకాంత గృహవాసం నిర్దేశాలను ఉల్లంఘించే కోవిడ్-19 రోగులు రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 951 మంది ఏకాంత గృహవాస వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

మరోవైపు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, వాణిజ్య ఆహార ప్రదేశాల యజమానులకూ రూ.5000 జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు, రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా విధించిన ఆంక్షలను ధిక్కరించేవారికి ఇదొక హెచ్చరిక కానుంది. హర్యానా రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, ముఖ కవచాలు, చేతి తొడుగులు తదితరాలను సురక్షితంగా పారవేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక కార్యక్రమం ప్రారంభించింది. కేరళ రాష్ట్రంలో ఇవాళ మూడు మరణాలు నమోదవడంతో మొత్త మృతుల సంఖ్య 53కు చేరింది. కాగా, కోళికోడ్‌లోని చెకియాడ్ పంచాయతీలో కోవిడ్ సామాజిక వ్యాప్తి అంచున ఉందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ డాక్టర్‌ వివాహం సందర్భంగా ఆయనసహా పెళ్లికి హాజరైన 23 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కోట్టయం వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ వైద్యులు వ్యాధిగ్రస్తులతో పరిచయంవల్ల కోవిడ్‌ బారినపడ్డారు. రాష్ట్రంలో మరోసారి దిగ్బంధం విధింపునకు తాము వ్యతిరేకమని అఖిలపక్ష సమావేశానికి ముందే సీపీఎం ప్రకటించింది. అవసరమైతే, స్థానిక స్థాయిలో కఠినచర్యలు తీసుకోవచ్చునని సూచించింది.

కేరళలో నిన్న అత్యధికంగా 1078 కేసులు నమోదవగా వీటిలో 798 పరిచయాలద్వారా సోకాయి. మరో 65 కేసులకు మూలాలు తెలియలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,458మంది చికిత్స పొందుతుండగా 1,58,117మంది పరిశీలనలో ఉన్నారు.
తమిళనాడు: రాష్ట్రంలోని రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందిసహా భద్రత, అగ్నిమాపక సేవా సిబ్బంది కూడా కరోనావైరస్‌ బారినపడ్డారు. మరోవైపు కోవిడ్‌ వ్యాధి నివారణకు తాము రూపొందించిన ‘కరోనిల్‌’ ఆయుర్వేద ఔషధం విక్రయాలపై తాత్కాలిక నిలిపివేతను రద్దుచేయాలని కోరుతూ పతంజలి సంస్థ మద్రాస్ హైకోర్టులో అభ్యర్థన దాఖలు చేసింది. కాగా, వ్యాపార చిహ్నం ఉల్లంఘన కింద చెన్నైలోని పారిశ్రామిక పరికరాల శుభ్రత సంస్థ పతంజలిపై పిటిషన్‌ దాఖలు చేసింది. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో కేసులు పెరగడంతో చెన్నైకి డిప్యుటేషన్‌పై పంపిన ప్రభుత్వ వైద్యులు తిరిగి వారి సాధారణ పని ప్రదేశాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో నిన్న 6472 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,92,964కు పెరిగాయి; అలాగే మరో 88 మరణాలతో మృతుల సంఖ్య 3,232కు చేరింది. చెన్నైలో కేసుల సంఖ్య ప్రస్తుతం 90,000 స్థాయిని దాటింది.

మొట్టమొదటి స్వదేశీ నాన్-ఇన్వేజివ్‌ వెంటిలేటర్ ‘స్వస్థాయు’పై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరమైన పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కోవిడ్‌ దిగ్బంధంవల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన ఎస్సీ-ఎస్టీలకు స్వయంఉపాధికోసం ప్రభుత్వం త్వరలో ఆర్థిక సహాయం అందించనుంది. కోవిడ్ పడకల లభ్యతపై ఆన్‌లైన్ పోర్టల్‌లో తాజా సమాచారం ఉంచాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో నిన్న 5030 కొత్త కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో బెంగళూరు నగరంలో 2207 నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కేసులు80,863కు చేరాయి; వీటిలో యాక్టివ్‌ కేసులు: 49,931; మరణాలు: 1616గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నందున జూలై 26 నుంచి జిల్లాలో దిగ్బంధం విధిస్తారన్న సోషల్‌ మీడియా ప్రచారాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఖండించారు. ఇదంతా కేవలం వదంతి మాత్రమేనని, సదరు వార్తలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. కాగా, నెల్లూరు జిల్లాలో ఇవాళ్టినుంచి దిగ్బంధం విధించబడింది. అయితే, ప్రజల సౌకర్యార్థం వాణిజ్య దుకాణాలు మధ్యాహ్నం 1:00 గంటవరకు తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తిరుపతిలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇవాళ రుయా ఆసుపత్రివద్ద రోగ నిర్ధారణ పరీక్ష కోసం బారులుతీరారు.

రాష్ట్రంలో నిన్న 7998 కొత్త కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 72,711; యాక్టివ్‌ కేసులు: 34,272; మరణాలు: 884గా ఉన్నాయి. హైదరాబాద్‌లో కోవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, రోగ నిర్ధారణ ప్రయోగశాలలు అక్రమాలకు పాల్పడితే వాటిని మూసివేసేందుకు వెనుకాడబోమని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలో నిన్న 1567 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1661 మంది కోలుకున్నారు. ఇక కొత్త కేసులలో 662 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తం కేసులు: 50,826; యాక్టివ్‌ కేసులు: 11,052; మరణాలు: 447; డిశ్చార్జి కేసులు: 39,327గా ఉన్నాయి.

సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టిన స్పర్శరహిత టికెట్ తనిఖీ వ్యవస్థ వంటి వినూత్న ఆవిష్కరణను కోవిడ్‌ నివారణలో వినియోగించడంపై ముంబై నగరపాలక సంస్థ యోచిస్తోంది. కాగా, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద టికెట్ తనిఖీ సిబ్బంది కోసం సెంట్రల్‌ రైల్వే ముంబై డివిజన్ ‘చెకిన్-మాస్టర్’ పేరిట యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని సాయంతో ప్రయాణికుల టికెట్లను సురక్షిత దూరం నుంచి తనిఖీ చేయవచ్చు. త్వరలో అమలు చేయబోయే తదుపరి దశలో ఆటోమేటిక్ క్యూఆర్-కోడ్ ఆధారిత టికెట్ తనిఖీ వ్యవస్థను ప్రవేశ/నిష్క్రమణ ద్వారాలవద్ద ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇప్పటిదాకా ముంబైలో నమోదైన మొత్తం 1.05 లక్షల కేసులలో ప్రస్తుతం 22,800 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రం మొత్తంమీద యాక్టివ్‌ కేసులు:1.40 లక్షలుగా ఉంది. గుజరాత్ రాష్ట్రంలో గురువారం 1,078 కేసుల నమోదుతో మొత్తం కేసులు 52,477కు చేరాయి. గుజరాత్‌లో ఒకేరోజు అత్యధికంగా కేసుల రికార్డు మరోసారి నమోదైంది. కాగా, 12,348 యాక్టివ్‌ కేసులతో దేశంలో చురుకైన కేసుల విషయంలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో గురువారం 28 మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 2,257కు పెరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఉదయంవరకు 375 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 33,595కు, మృతుల సంఖ్య 598కి చేరాయి. ఇవాళ అల్వార్ జిల్లాలో ఒకేరోజు 224 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సంక్రమణ ఫలితంగా ఈ ఏడాది రక్షాబంధన్, ఈద్-ఉల్-జుహా పండుగలను బహిరంగంగా నిర్వహించబోరు. కాగా, భోపాల్ పురపాలిక పరిధిలో 10 రోజులపాటు రాత్రి 8.00 నుంచి పూర్తి దిగ్బంధం విధించబడుతుంది. అయితే- మందులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాల సరఫరా కొనసాగుతుంది. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 632 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 25,474కు చేరాయి. అయితే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,355గా ఉంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గురువారం 371 కొత్త కేసులతో మొత్తం కేసులు 6,370కి చేరాయి. కొత్త కేసులలో ఒక్క రాయ్‌పూర్‌లో మాత్రమే 205 నమోదయ్యాయి.

కబీర్‌థామ్‌ 34, రాజ్‌నందగావ్ 23 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇటానగర్‌ రాజధాని ప్రాంతంలో 20 కోవిడ్‌ ప్రతిస్పందన బృందాలు ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన శిబిరాల్లో 2672 మందికి పరీక్ష చేశాయి. వీరిలో 30 మందికి కోవిడ్‌ నిర్ధారణ కాగా, వారందరికీ చికిత్స ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 42 మంది కోలుకోగా, ప్రస్తుతం 654 మంది చికిత్స పొందుతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో దిగ్బంధం కొనసాగుతున్న దృష్ట్యా ఇది ముగిసేదాకా అన్ని అప్పీల్, ఫిర్యాదుల కేసులపై విచారణను వాయిదా వేస్తున్నట్లు మణిపూర్ సమాచార కమిషన్ ప్రకటించింది. మిజోరం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కోవిడ్‌ నిర్బంధవైద్య కేంద్రాల కోసం మిజోరం ముఖ్యమంత్రి శ్రీ జొరమ్‌తంగా రూ. 3.85 కోట్లు మంజూరు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో 63 కొత్త కేసులు నమోదవగా వీటిలో దిమాపూర్‌ 41, కోహిమాలో 21, పెరెన్‌లో ఒకటి వంతున ఉన్నాయి. నాగాలాండ్‌లో మొత్తం 1,237 కేసులకుగాను ఇప్పటిదాకా 530 మంది కోలుకోగా 707 మంది చికిత్స పొందుతున్నారు.