న్యూఢిల్లీ, డిసెంబర్ 1 (న్యూస్‌టైమ్): కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి‌, ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్‌‌) ఛైర్మ‌న్ హోదాలో డాక్ట‌ర్‌ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ పాత ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో మాస్కులు, స‌బ్బులు పంపిణీ చేశారు. మాస్కు ధ‌రించ‌డం, చేతులు శుభ్రం చేసుకోవ‌డం ప్రాధాన్య‌త గురించి మాట్లాడుతూ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ ‘‘మ‌నం కోవిడ్‌పై పోరాటంలో త్వ‌ర‌లోనే 11 నెల‌లు పూర్తి చేయ‌బోతున్నాం. అప్ప‌టినుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డానికి మ‌నం అనుస‌రిస్తూ, ఇత‌రులు అనుస‌రించాల్సిందిగా కోరుతున్న అత్యంత ముఖ్య‌మైన మౌలిక సూత్రం ప‌రిశుభ్ర‌త‌, భౌతిక దూరం పాటించ‌డం, కోవిడ్‌పై పోరాటంలో మ‌న అత్యంత ముఖ్య‌మైన ఆయుధం మాస్కు, శానిటైజ‌ర్‌’’ అని అన్నారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌తిఒక్క‌రూ మాస్కు ధ‌రించి ఉండ‌డం ప‌ట్ల డాక్ఠ‌ర్‌ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అభినందించారు. ‘‘మాస్క్‌, స‌బ్బు పంపిణీ వెనుక ఒక పెద్ద సందేశం ఉంద‌ని, దీని ల‌క్ష్యం ఈ సందేశాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డ‌ం’’ అని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం వివిధ మార్గాలు, వివిధ కార్య‌క‌లాపాల ద్వారా కోవిడ్ వ్య‌తిరేక పోరాటంలో ముఖ్య‌భాగ‌మైన శానిటైజ‌ర్ వాడ‌డం మాస్కుధ‌రించ‌డం, రెండు గ‌జాల దూరం పాటించ‌డం సందేశాన్ని ముందుకు తీసుకుపోతున్న‌ద‌ని చెప్పారు. కూలీలు, టాక్సీ యూనియ‌న్లు త్రిచ‌క్ర‌ వాహ‌న యూనియ‌న్లు ఈ విష‌యంలో అత్యంత ముఖ్య‌మైన పాత్ర పోషించ‌నున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఇండియాలో కోవిడ్ ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, కోవిడ్ పారామీట‌ర్ల‌లో సాధించిన ప్ర‌గ‌తిని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోనే ఇండియాలో అత్యంత ఎక్కువ కోవిడ్ రిక‌వ‌రీలు ఉ న్నాయ‌ని ఆయ‌న అన్నారు.

2020 జ‌న‌వ‌రిలో ఒకే ఒక ల్యాబ్ ఉన్న‌ద‌శ నుంచి ప్ర‌స్తుతం మ‌నంకు 2,165 ల్యాబ్‌లు ఉన్నాయ‌న్నారు. రోజూ మిలియ‌న్ మంది ప్ర‌జ‌ల‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికి 14 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌న్నారు. ఇదంతా ప్ర‌భుత్వ నిరంత‌ర కృషి, ప‌ట్టుద‌ల మ‌న క‌రోనాపై పోరాట‌యోధుల కృషికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీజీ మార్గ‌నిర్దేశ‌నంలో ఇండియా మాస్కులు, పిపిఇ కిట్లు, వెంటిలేట‌ర్ల త‌యారీలో స్వావ‌లంబ‌న సాధించిందన్నారు.

10 ల‌క్ష‌ల‌కు పైగా పిపిఇ కిట్లు రోజూ ఇండియాలో త‌యారౌతున్నాయని, ప్ర‌స్తుతం మ‌న శాస్త్ర‌వేత్త‌లు వాక్సిన్ ప‌రిశోధ‌న‌లో కీల‌క భూమిక పోషిస్లున్నారన్నారు. ఇది స‌కాలంలో అందుబాటులోకి వ‌స్తుంది అని ఆయ‌న అన్నారు. దో గ‌జ్ కీ దూరి ప‌ద్ధ‌తిని పాటించాల్సిందిగా డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఒక చిన్న నిర్ల‌క్ష్యం, పొర‌పాటుతో తీవ్ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయని, ప్ర‌పంచంలో మ‌న‌దేశంలో మ‌ర‌ణాల రేటు త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ, ఒక్క‌రు వ్యాధికి గురై మ‌ర‌ణించినా అది వారి మిత్రులు, కుటుంబానికి ఎంతో న‌ష్టమని, ఇది తను మ‌న‌స్ఫూర్తిగా అంద‌రికీ చేస్తున్న విజ్ఞ‌ప్తి అని అన్నారు. ఈ సందేశాన్ని అందరూ వీలైనంత ఎక్కువ మందికి వ్యాప్తి చేయాలని కోరారు.