రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్ల పరిశీలన

0
6 వీక్షకులు

చిత్తూరు, జనవరి 24 (న్యూస్‌టైమ్): ఈ నెల 26వ తేదీన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 26వ తేదీన జరుగు 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై ఎస్.పి.సెంథిల్ కుమార్, డి.ఆర్.ఓ. విజయచందర్, జెట్.పి. సి.ఈ.ఓ కోదండరామిరెడ్డి, డి.ఆర్.డి.ఏ. పి.డి మురళి, ఇతర సంబంధితాధికారులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసేందుకు వచ్చే ప్రజలకు, పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీటింగ్, తాగు నీరు ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసు, అగ్నిమాపక శాఖ వారిచే చేసే ప్రదర్శనలు నిర్ణీత సమయంలో జరిగే విధంగా చూడాలన్నారు. పతాక ఆవిష్కరణ 7.45 గంటలకు ఖచ్చితంగా నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. వేదికపైన సీటింగ్ ఏర్పాట్లు, మైక్ సిస్టమ్, వి.ఐ.పి గ్యాలరీ, ప్రశంసా పత్రాలు పొందే వారికి ప్రత్యేక గ్యాలరీ ఇలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలన్నారు. ప్రశంసా పత్రాలు అందజేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ వారు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. వివిధ శాఖల చే ఏర్పాటు చేసే స్టాల్స్ కు స్టాల్స్ ను కేటాయించి వారి శాఖలకు సంబందించిన సమగ్ర ప్రగతిని ప్రదర్శించేలా ప్రదర్శన స్టాల్స్ ఉండాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here