గిరిజన బాలికపై ఆర్ఎంపీ అఘాయిత్యం

141
  • ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనపై కేసు నమోదు

వరంగల్, డిసెంబర్ 2 (న్యూస్‌టైమ్): హన్మకొండ జులైవాడ ఎస్టీ హాస్టల్‌లో చదువుకుంటున్న 14 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ఆర్ఎంపీ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళ్ళలో నీరుకారుతుండడంతో స్థానిక ఆర్ఎంపీ రాజును సంప్రదించిన బాలిక చివరికి బాధితురాలైంది.

బాలికను పరీక్షించిన వైద్యుడు రాజు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు వదిలిన అనంతరం విషయాన్ని గ్రహించిన సదరు విద్యార్థిని ఏడ్చుకుంటు హాస్టల్‌కి వెళ్ళి తరువాత ఫోన్‌లో ములుగు జిల్లాలో ఉండే తన తల్లిదండ్రులుకు తెలిపింది. దీంతో వారు సుబేదారి పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడు రాజుపై ఫాక్స్‌లో యాక్ట్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, సోమవారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రాధమిక విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడించనున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.