లారీని ఢీకొన్న కారు: ఐదుగురు దుర్మరణం

192

రంగారెడ్డి, జులై 9 (న్యూస్‌టైమ్): రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ సమీపంలోని హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారి మెడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా త్రివంగా గాయపడ్డ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

వీరు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారు వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవదర్శనం చేసుకొని వస్తుండగా మెడిగడ్డ గ్రామ సమీపంలో గణపతి వేబ్రిడ్జ్‌కి కాంటా కోసం లారీ టర్న్ అవుతుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇనోవా కారు ఢీ కొనడంతో ఇనోవాలో ఉన్న దుర్గాప్రసాద్, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు శాంతన్, దుర్గాప్రసాద్ బావ, అతని భార్య అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ఖలీల్ తీవ్ర గాయాలు కావటంతో హైదరాబాద్‌కు తరలించారు.