రౌడీషీటర్ తల నరికేశారు!

0
16 వీక్షకులు
అంబటి ఎల్లంగౌడ్

సిద్ధిపేట, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): పాతకక్షలు ఓ రౌడీషీటర్ హత్యకు కారణమయ్యాయి. లాక్‌డౌన్ వేళ సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసి దుండగులు అతి కిరాత‌కంగా హతమార్చారు. చిన్నకోడూరు మండలం రామంచ వద్ద ఇమామ్‌బాద్‌కు చెందిన అంబటి ఎల్లమ్ గౌడ్ అనే రౌడీ షీటర్‌ను మరో ముఠా దారుణంగా హత్య చేసింది. గౌడ్‌ను అతని భాగస్వామి తడకపల్లి వెంకట్ ముఠా హత్య చేసినట్లు చెబుతున్నారు.

హత్యకు గురైన అంబటి ఎల్లంగౌడ్

ముగ్గురు సభ్యుల ముఠా ఎల్లమ్ గౌడ్‌పై దాడి చేసి చంపేసింది. షమీర్‌పేటలో పోలీసులపై తుపాకీ కాల్పుల సమయంలో కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఎల్లమ్ గౌడ్ నిందితుడు, నకిలీ కరెన్సీ రాకెట్‌లో 16 కేసులు, కర్ణాటకలో నాలుగు కేసులు ఉన్నాయి.

ఘటన గురించి తెలిసిన వెంటనే సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ పాటు క్లూస్ బృందం సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, ఎల్లమ్ గౌడ్‌ను హత్య చేసిన దుండగులు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ వద్ద లొంగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here