హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం చేయబడిన బండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలోని అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందులో బండ్లగూడా టౌన్‌షిప్‌లో 2246 ప్లాట్స్ పోచారం టౌన్‌షిప్‌లో 1470 మొత్తం సుమారుగా ఈ 3716 నిర్మించిన ప్లాట్స్ ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం ఉందో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. గృహాల అమ్మకం విలువలు ఇంకా కొంత మెరుగు పరిచి, బహిరంగ మార్కెట్‌లో అర్ధవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయాలని అధికారులను, వాల్యుయర్స్ సంస్థను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ,రాజీవ్, స్వగృహ డైరెక్టర్ ఎస్.ఈ. రవీందర్ రెడ్డి, జనరల్ మేనేజర్స్, వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here