న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (న్యూస్‌టైమ్): సిడాక్ డైరక్టర్ జనరల్ డాక్టర్ హేమంత్ దర్బారి, డైరక్టర్ ఆఫ్ నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్.ఎస్.ఎం) హోస్ట్ సంస్థల మధ్య ఈరోజు కేంద్ర ఎలక్ట్రానిక్సు, ఐటి శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది. దేశంలో అసెంబ్లింగ్, తయారీ సదుపాయాలతో సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఐఐఎస్సి, బెంగళూరు, ఐఐటి కాన్పూరు, ఐఐటి రూర్కీ, ఐఐటి హైదరాబాదు, ఐఐటి గౌహతి, ఐఐటి మండి, ఐఐటి గాంధీనగర్, ఎన్ఐటి ట్రిచి, ఎన్.ఎ.బి.ఐ మోహాలిలలో కీలక విడిభాగాల తయారీ, ఐఐటి మద్రాసు, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి గోవా, ఐఐటి పాలక్కాడ్ లలో శిక్షణకు ఎన్.ఎస్.ఎం నోడల్ సెంటర్ల ఏర్పాటు వంటి వాటికి ఎం.ఇ.ఐ.టి.వై కార్యదర్శి అజయ్ సాహ్ని, డిఎస్టి కార్యదర్శి ప్రోఫెసర్ అశుతోష్ శర్మ, ఎఫ్.ఎ, ఎం.ఇ.ఐ.టి ప్రత్యేక కార్యదర్శి జ్యోతి అరోరా, ఎం.ఇ.ఐటి వై అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్రకుమార్ ,డిఎస్టి, ఎం.ఇ.ఐటి వై, హోస్ట్ సంస్థల సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
కేంద్ర సహాయమంత్రి సంజయ్ ధోత్రే దీనిగురించి వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోది దార్శనికతతో కూడిన నాయకత్వంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏర్పాటైందని అన్నారు. ఇది విద్యాసంస్థలకు, పరిశ్రమ, శాస్త్ర, పరిశోధన రంగాల వారికి, ఎం.ఎస్.ఎం.ఇలు,స్టార్టప్‌లకు ఇండియాకు ప్రత్యేకమైన పెద్ద సవాళ్లు, సైన్సు ఇంజనీరింగ్‌లో సంక్లిష్ట వాస్తవ సమస్యల విషయంలో అవసరమైన కంప్యుటేషనల్ శక్తిని సమకూర్చేందుకు దీనిని ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు.
సి-డాక్ ఇప్పటికే సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థను ఐఐటి బిహెచ్‌యు, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐఎస్ఇఆర్ పుణే, జెఎన్సిఎఎస్ఆర్ బెంగళూరులలో ఏర్పాటుచేసింది. ప్రస్తుతం కంప్యుటేషనల్ సైన్సు టెక్నిక్లను ఉపయోగించి పరిశోధన, ఆవిష్కరణలను వేగవంతం చేయనున్నారు. అలాగే సూపర్ కంప్యూటింగ్ కీలక విడిభాగాలైన సర్వర్ బోర్డు, ఇంటర్ కనెక్ట్, ర్యాక్పవర్ కంట్రోలర్లు, హైడ్రాలిక్ కంట్రోలర్లు, డైరక్ట్ లిక్విడ్ కూల్డ్ డాటా సంఎటర్, హెచ్‌పిసి సాఫ్ట్వేర్ స్టాక్ వంటి వాటిని ఇండియాలోనే తయారుచేయనుండడం ఆత్మనిర్భర్ దిశగా ముందడుగుగా చెప్పుకోవచ్చు.