ఉట్టికెగ‌ర‌లేడు కానీ…

130
  • ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో…

అమరావతి, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా ఉల్లి ధరలు పెరిగిపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ సమస్య దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నదే అయినప్పటికీ దక్షిణాదిలో మాత్రం కాస్త తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఇక్కడి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వినూత్న రీతిలో నిరసన ప్రచారానికి ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో వదిలింది.

ప్రస్తుతం అదే, ఇప్పుడు రాజకీయంగా వైరల్ అయింది. ‘‘YS Jagan Mohan Reddy గారూ! మీలాంటి వాడే ఉట్టికెగ‌ర‌లేడు కానీ, స్వ‌ర్గానికి ఎగురుతాన‌న్నాడ‌ట‌! రాయితీపై కేజీ ఉల్లి ఇవ్వ‌లేని మీరు ఢిల్లీవెళ్లి హోదా తెస్తాన‌న్న‌ట్టే ఉంది. మీకు ఢిల్లీలో షా అపాయింట్‌మెంట్ లేదు.. ఇక్కడ గ‌ల్లీలో జ‌నాల‌కు ఉల్లి లేదు.

మీ అస‌మ‌ర్థ‌పాల‌న‌తో కేజీ ఉల్లిపాయల కోసం జనం పడే బాధలు చూడండి. పాల‌న అంటే.. దుష్ప్ర‌చారం చేయ‌డంకాదు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవ‌డం కాదు. మంచి చేయ‌డ‌మంటే ఇలా ప్రజల్ని న‌డిరోడ్డున ప‌డేయ‌డం అస‌లే కాదు’’ అంటూ ఓ పోస్టును మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు.

అదేంటో మీరూ చూడండి… వినండి.