న్యూఢిల్లీ, మార్చి 23 (న్యూస్‌టైమ్): భార‌త ప్ర‌భుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని మ‌హార‌త్న ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ప‌వ‌ర్ గ్రిడ్‌) సంస్థ జేపీ ప‌వ‌ర్ గ్రిడ్ లిమిటెడ్ -జెవి (జెపిఎల్)లో 74% వాటాల‌ను కొనుగోలు చేసేందుకు జ‌యప్ర‌కాష్ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ లిమిటెడ్ (జెపివిఎల్‌)తో ఒప్పందంపై సంత‌కాలు చేసింది. ఈ సంస్థ‌లో ప‌వ‌ర్ గ్రిడ్ 26% ఈక్విటీని క‌లిగి ఉంది. ఈ స‌ముపార్జ‌న‌తో ప‌వ‌ర్ గ్రిడ్ సంస్థ జెపిఎల్‌ను పూర్తిగా త‌న అనుబంధ సంస్థ‌గా చేసుకోనుంది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌ర్చాం- వాంగ్టూ ప్రాజెక్టు నుంచి విద్యుత్ పూర్తిగా త‌ర‌లించేందుకు జెపిఎల్‌-జెవి సంస్థ 214 కిమీల పొడ‌వైన ఇహెచ్‌వి విద్యుత్ ట్రాన్స్మిష‌న్ ప్రాజెక్టును అభివృద్ధి చేసంది. ప్ర‌సారం చేసిన విద్యుత్తు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, పంజాబ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల‌లో వినియోగం కోసం ఉద్దేశించింది.