యూజీ ఎడ్యుకేషన్‌ బీవోఎస్‌గా షారోన్‌రాజు

81
ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి నుంచి ఉత్తర్వులను స్వీకరిస్తున్న ఆచార్య షారోన్‌ రాజు
  • ఉత్తర్వులు అందజేసి అభినందించిన ఏయూ వీసీ

విశాఖపట్నం, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్‌ విభాగ యూజీ కోర్సులకు బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా ఐఏఎస్‌ఈ ఆచార్యులు డాక్టర్ టి.షారోన్‌ రాజు నియమితులయ్యారు. సోమవారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో షారోన్‌ రాజుకు ఉత్తర్వులను అందజేసి అభినందించారు.

కోర్సుల్లో కాలానుగుణంగా మార్పులు చేస్తూ, పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన విధానాల రూపకల్పన చేసి సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్‌ డీన్‌ ఆచార్య కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సిటిఇ సూచనలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఏయూ సిలబస్‌ను అమలు చేయడానికి, బోధన, పరీక్షలు, మూల్యాంకనం పటిష్టంగా నిర్వహించడానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని డాక్టర్‌ టి.షారోన్‌ రాజు తెలిపారు.