గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని కేంద్రానికి వినతి

35
138 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 8 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేసిన సూచనల మేరకు కొనుగోళ్ల మూలంగా కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రంలోని పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రధాన కేంద్రాలలో వ్యవసాయ మార్కెట్లన్నీ మూసివేశామని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గన్నీ బ్యాగుల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, ఆలస్యం చేస్తే తీవ్ర ఇబ్బందులు వస్తాయని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు.

వ్యవసాయ మార్కెట్లలో రైతుల రద్దీ పెరిగితే కరోనా వైరస్ ప్రబలుతుందని గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, ధాన్యం కొనుగోళ్లను ఎక్కడికక్కడ చేపట్టేందుకు రాష్ట్రంలో 7077 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామని, లోడింగ్, అన్ లోడింగ్ విషయంలో హమాలీల కొరత, కోతల విషయంలో వ్యవసాయ కూలీల కొరత వేధిస్తుందని, ఈ సమస్య అధిగమించేందుకు కేంద్రం తోడ్పాటు అందించాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చారని, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. వరి కోతలన్నీ దాదాపు యంత్రాల మీదే ఆధారపడి జరుగుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం రావడం మొదలయిందని, రైతులకు కూపన్లు అందజేసి కొనుగోలు కేంద్రాలలో రద్దీ లేకుండా దశల వారీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో 40 లక్షల ఎకరాల నుండి కోటి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అసాధారణ రీతిలో మార్కెట్లకు పోటెత్తనుందని, ధాన్యం నూర్పిడి యంత్రాల నుండి కొనుగోళ్ల వరకు ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. బత్తాయి కొనుగోళ్లు ప్రధానంగా ఢిల్లీ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయని, కేంద్రం బత్తాయి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని, పరిష్కారాలు సూచించాల్సి ఉందన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రాబోయే ఖరీఫ్‌లో రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులు అవసరానికి సరిపడా రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వైరస్ మూలంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు మార్కెట్లకు పోటెత్తకుండా 300 వాహనాలతో హైదరాబాద్‌లో 500 పైచిలుకు ప్రదేశాలలో ప్రతిరోజూ మొబైల్ రైతుబజార్లతో కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రజలు గుమికూడకుండా ప్రభుత్వం చేసిన ప్రయోగం ఫలించిందన్నారు. విత్తన సరఫరాకు సంబంధించి అంతరాష్ట్ర సమస్యలున్నాయని, వాటిని కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరారు. విత్తన ప్యాకేజీకి సంబంధించిన సామాగ్రి సింగపూర్‌లో చిక్కుకుపోయిందని, కేంద్రం దాన్ని పరిష్కరించకుంటే రాబోయే ఖరీఫ్‌లో రైతులకు విత్తనాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

మొబైల్ రైతు బజార్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను కేంద్రం ప్రశంసించింది. అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖా మంత్రులు, శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్‌కు హైదరాబాద్‌లోని ఎన్ఐసీ నుండి హాజరై రాష్ట్ర సమస్యలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

35 COMMENTS

  1. [url=https://ivermectin.us.org/]ivermectin 3 mg dose[/url] [url=https://proscar.us.com/]buy proscar[/url] [url=https://cephalexin365.com/]buy cephalexin[/url] [url=https://chloroquine.us.org/]malaraquin[/url] [url=https://amitriptyline24.com/]buy elavil[/url]

  2. [url=https://amitriptyline24.com/]amitriptyline cost india[/url] [url=https://prednisolone.us.org/]prednisolone 15[/url] [url=https://nexium.us.org/]buy nexium otc[/url] [url=https://attarax.com/]atarax tablets[/url] [url=https://retina.us.org/]retin a micro[/url]

  3. [url=https://priligy.us.com/]priligy online purchase[/url] [url=https://motrin.us.com/]motrin[/url] [url=https://malegra.us.org/]malegra dxt online[/url] [url=https://prazosin.us.com/]buy prazosin[/url] [url=https://chloroquine.us.org/]chloroquine generic[/url]

  4. [url=https://cephalexin365.com/]where to buy cephalexin[/url] [url=https://ivermectin.us.org/]buy stromectol online[/url] [url=https://singulair.us.com/]singulair prices[/url] [url=https://hydroxychloroquine.us.com/]buy hydroxychloroquine[/url] [url=https://prednisolone.us.org/]buy prednisolone 5mg[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here