చూడచక్కని ప్రాంతం శ్రీరంగపట్నం

2237

మైసూర్, జనవరి 15 (న్యూస్‌టైమ్): శ్రీరంగపట్నం అనే ఊరు మైసూరు పట్టణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. టిప్పు సుల్తాన్‌ కాలంలో అది అప్పటి మైసూరు రాజ్యానికి రాజధాని. ఆ ఊరిలో కూడా ఒక రంగనాధ ఆలయం ఉంది. అరుతే అది ప్రత్యేకించి యాత్రగా వెళ్లి రాదగినంత ప్రసిద్ధి ఉన్న ప్రదేశం కాదు. మైసూరు చూడడానికి వెళ్లిన వారు శ్రీరంగపట్టణం కూడా చూసి వస్తారు. అందువల్ల మీరు వెళ్లాలనుకుంటున్నది అందరూ చెప్పుకునే శ్రీరంగం అనుకుంటే దానికి సంబంధించిన వివరాలు రాస్తున్నాను.

శ్రీరంగం తమిళనాడులో ఉంది. తిరుచునాపల్లికి ఉత్తరపు అంచున కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి అవతలి వైపు ఉన్నదే శ్రీరంగం. నిజానికి శ్రీరంగం చిన్న దీవి. తిరుచానపల్లి నుంచి సుమారు అరుదు కిలోమీటర్ల ఎగువన కావేరి నది రెండు పాయలుగా చీలింది. ఈ రెండు పాయల మధ్య ఉన్న చిన్న దీవిలాంటి భూభాగమే శ్రీరంగం. ఈ దీవి సుమారు అరుదు లేక ఆరు కిలోమీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. నది కుడివైపు పాయ తిరుచునాపల్లికి శ్రీరంగం ఉన్న దీవికి మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఊరికి రెండు కిలోమీటర్ల దిగువున దీవి అఖరరుపోతుంది.

అక్కడ దీనికి రెండు వైపుల నుంచి వచ్చిన పాయలు కలిసిపోరు, నది ఒకే ప్రవాహంగా ముందుకు సాగిపోతుంది. తిరుచునాపల్లి వైపు ఒడ్డు నుంచి శ్రీరంగం దీని ఒడ్డు వరకూ నది మీద వంతెన ఉంది. ఇక్కడ నది మూడు వందలు లేదా నాలుగువందల మీటర్ల వెడల్పు ఉంటుంది. వంతెన దాటిన తరువాత దీవిలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో రంగనాధస్వామి ఆలయం ఉంది.

తిరుచునాపల్లిలో రైల్వేస్టేషన్‌ నుంచి, బస్‌స్టాండ్‌ నుంచి శ్రీరంగం ఆలయం వరకూ సరాసరి వెళ్లే సిటీ బస్సులు ఉన్నారు. దాదాపు అరగంట ప్రయాణం. తిరుచునాపల్లి తమిళనాడు రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. అందువల్ల అన్ని రకాల యాత్రికులకు అందుబాటులో ఉండే హోటళ్లు, లాడ్జీలకు కొదవ లేదు. శ్రీరంగం దీవిలోనే వంతెన దాటగానే పరమశివుడు జలరూపంలో వెలసిన జంబుకేశ్వర ఆలయం ఉంది. ఆలయ నిర్మాణశైలి, శిల్పసౌందర్యం గొప్పగా ఉంటుంది.