కరోనా నేపథ్యంలో సామాజిక దూరం

0
11 వీక్షకులు

చిత్తూరు, మార్చి 21 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సామాజిక దూరాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపు నిచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రతి ఒక్కరు కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక దూరం పాటించడంతో పాటు, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. జిల్లాలో ఇంత వరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో కరోనా నియంత్రణలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, వీరితో పాటు క్షేత్ర స్థాయిలో సర్వలెన్స్ టీమ్, సర్వే టీమ్, రిసోర్స్ మొబిలైజేషన్ టీమ్‌లు చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. మండల స్థాయిలో యం.ఆర్.ఓ, యం.పి.డి.ఓ, మెడికల్ ఆఫీసర్లు అన్నీ సంబందిత శాఖలను సమన్వయం చేసుకొని పనిచేయడం జరుగుతుందని తెలిపారు.

కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా సచివాయలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేస్తుందని, కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9849902379కు కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారమైన విదేశాల నుంచి వచ్చి 28 రోజులు హోం ఐసోలెషన్‌లో లేకుండా, విదేశాల నుంచి వచ్చి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించకుండా ఉన్న వారి వివరాలను తెలపవచ్చునని పేర్కొన్నారు.

మెడికల్, పంచాయతీ, పోలీసు శాఖలకు సంబంధించిన సిబ్బంది ఈ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 163 ఫోన్ కాల్స్ ఈ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అందాయన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అధికారుల సన్నద్దతను నిర్దారించేందుకు మాగ్ డ్రిల్ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం జిల్లాలో చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు మండలం మునిసిపాలిటీ పరిధిలో జి.డి. నెల్లూరు నియోజకవర్గంలో జి.డి. నెల్లూరు మండలంలో, తంబళ్లపల్లి నియోజకవర్గంలో తంబళ్లపల్లి మండలంలోని కోసవారిపల్లిలో, పీలేరు నియోజకవర్గంలోని కలకడ మండలంలో, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో, పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు మండలంలో కొలమాసనపల్లి, నగిరి నియోజకవర్గంలోని వడమాల పేట మండలంలో, సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలంలోని దాసుకుప్పం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి మండలంలోని యంపేడు, తిరుపతి నియోజకవర్గంలోని తిరుపతి అర్బన్ పరిధిలోని 10వ డివిజన్‌లో, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here