కరోనాపై పోరుకు సంఘీభావం

0
7 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందించారు.

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరఫున 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఛైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. లింబాద్రి, వైస్ ఛైర్మన్ వి. వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో 2 లక్షల 50 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు.

గ్రీన్ కో గ్రూప్ 5 కోట్ల రూపాయల విలువైన లక్ష పీపీఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సీఎంకు అందించారు.

మైత్రా ఎనర్జీ గ్రూప్ 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ఎం.డి. విక్రమ్ కైలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్ సీఎంకు అందించారు.

తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందించడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ప్రెసిడెంట్ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

శ్రీ రామచంద్ర మిషన్ 1 కోటి 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయిన్ట్ సెక్రటరి వంశీ చలగుల్ల, డాక్టర్ శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు.

ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి. వెంకటేశ్వర రెడ్డి సీఎంకు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here