ఐపీఎల్ రద్దుపై త్వరలో ప్రకటన?

0
16 వీక్షకులు
విజేత టీ‌మ్‌కు బహూకరించే ఐపీఎల్ ట్రోపీ

ముంబయి, మార్చి 30 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. నిజంగా ఇదిప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కరోనావైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ను రద్దు చేయాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. తొలుత నిర్ణయించిన ప్రకారం ఐపీఎల్ నిన్ననే ప్రారంభం కావాల్సి ఉండగా, దేశంలో కరోనావైరస్ (కొవిడ్-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అయితే, అప్పటికి కూడా దేశంలో పరిస్థితులు కుదుటపడే అవకాశం కనిపించకపోవడంతో ఐపీఎల్‌ ఈ సీజన్‌ను పూర్తిగా రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా సంబరాలు కరోనా నేపథ్యంలో రద్దయ్యాయి. కొన్ని ఆటలైతే సామాజిక దూరంలో భాగంగా ప్రేక్షకులు లేకుండానే ముగిశాయి. అయితే, ప్రేక్షకులు లేకుండా క్రికెట్ ఆడడంలో మజా ఉండదు కాబట్టి దీన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here