తప్పైపోయింది క్షమించండి!

0
4 వీక్షకులు
లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ద్విచక్ర వాహన చోదకునికి వినూత్న శిక్ష విధిస్తున్న ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ

విజయవాడ, ఏప్రిల్ 21 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయో గానీ, బెజవాడలో ఓ పోలీసు అధికారి నిర్ణయం మాత్రం వినూత్నంగా వైరల్ అయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహన చోదకులతో ‘తప్పైపోయింది క్షమించండి’ అంటూ ఐదొందల సార్లు తెల్లకాగితంపై రాయిస్తూ వార్తల్లో నిలిచారు బెజవాడ ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ.

ఇలా చేయడం ద్వారా ఆయన ప్రజల్లో కరోనా పట్ల అవగాహన మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. లాక్‌డౌన్‌లో తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్లకు మించిన దూరం ప్రయాణించకూడదన్న నిబంధన కీలకమైనది. భౌతిక దూరం పాటించడం, మరీ అత్యవసరం అయితేనే, అది కూడా ఇంటికి సమీపంలోని దుకాణాలకు మాత్రమే అనుమతించడం చేస్తున్నారు పోలీసులు. కానీ, అనవసరంగా రోడ్లపైకి వాహనాలతో వచ్చే వారిని ఇలా పోలీసులు దండించే ప్రయత్నం మంచిదే. రూల్స్ బ్రేక్ చేసినందుకు వినూత్నంగా పనిష్మెంట్ ఇస్తున్న బెజవాడ ట్రాఫిక్ పోలీసులను కామెంట్ చేయడం కంటే కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొనైనా కొంత మంది లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉంటారని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here