కరోనా నియంత్రణపై విశేష ‘స్పందన’

0
7 వీక్షకులు
ఫోన్‌లో అడిగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్

ఒంగోలు, ఏప్రిల్ 18 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ నియంత్రణపై ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ చేపట్టిన స్పందన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. శనివారం ఉదయం 10 నుంచి 11 గంటలవరకు తన ఛాంబర్‌లో టోల్ ఫ్రీ నెంబరు 1077 ద్వారా ప్రజల విజ్ఞప్తులను నేరుగా జిల్లా కలెక్టర్ ఆలకించారు. వివిధ ప్రాంతాల నుంచి 16 కాల్స్ వచ్చాయి.

కరోనా వైరస్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్ మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ పేదప్రజలకు నిత్యావసరాలు అందక ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డు లేకపోవడంతో నిత్యావసర సరుకులు అందలేదని, కార్డు ఇప్పించాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. మరికొంత మంది రిలీఫ్ సెంటర్లో నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా చేరుతున్నారని, వారిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్, నిర్మాణరంగ పనులకు అనుమతి ఇచ్చి ఉపాధి మార్గం చూపాలని కొందరు, వివిధ రకాల వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని మరికొంతమంది విన్నవించారు.

పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి అక్కడికి వెళ్లే అనుమతి ఇవ్వాలని కొందరు కోరగా ఆన్‌లైన్ ద్వారా విక్రయించే ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. వెంకటసుబ్బయ్య, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here