కరోనా కష్టాలపై అసెంబ్లీ స్పీకర్ ఆరా

0
20 వీక్షకులు
బూమ్ స్ప్రేయర్ యంత్రాన్ని స్పీకర్ పరిశీలించినప్పటి దృశ్యం

నిజామాబాద్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకోవడానికి బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి, కాలనీలలో స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో స్పీకర్ మాట్లాడుతూ సమర్ధవంతమైన చర్యలతో బాన్సువాడ పట్టణంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలిగామని అన్నారు. ఇదేవిధంగా లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన పోచారం, అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.

బయటకు వచ్చినా మాస్క్, ఇతర రక్షణ పరికరాలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విధుల నిర్వాహణలో అధికారులు అప్రమత్తంగా ఉండి, నిక్కచ్చిగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్సువాడ మున్సిపాలిటీకి అందించిన బూమ్ స్ప్రేయర్ యంత్రాన్ని స్పీకర్ పరిశీలించారు. అదే విధంగా పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అందజేస్తున్న నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here