విమాన సేవలు ప్రారంభం

0
5 వీక్షకులు

విశాఖపట్నం, జూన్ 4 (న్యూస్‌టైమ్): విశాఖ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. దేశీయ విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన తర్వాత ఉబర్ విశాఖపట్నం విమానాశ్రయంలో రవాణా సేవలను పునఃప్రారంభించామని ఉబర్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా హెడ్ రైడ్ షేరింగ్ రతుల్ ఘోష్ తెలిపారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైడర్స్ ఇప్పుడు సురక్షితమైన, సౌకర్యవంతమైన విమాన ప్రయాణ అవసరాల కోసం ఉబర్ గో, ఉబర్ ప్రీమియర్ సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. భారతదేశంలోని పలు నగరాల్లో విమానాశ్రయ ప్రయాణానికి సేవలను మరలా ప్రారంభించడం తమ సంస్థకు సంతోషంగా వుందన్నారు. మా డ్రైవర్లు, రైడర్లు సాధ్యమైనంత ఎక్కువ పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిర్ధారించటానికి విమానాశ్రయ అధికారులతో తాము నిరంతరం కలసి పని చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here