శ్రీనగర్-లే రహదారి ప్రారంభం

0
7 వీక్షకులు

శ్రీనగర్, ఏప్రిల్ 12 (న్యూస్‌టైమ్): లడఖ్‌ను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసే వ్యూహాత్మక శ్రీనగర్-లే రహదారిని సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్ఓ) ఎట్టకేలకు ప్రారంభించింది. సుమారు 18 చమురు ట్యాంకులు, ఇతర నిత్యావసర వస్తువులతో ఉన్న వాహనాలను జోజిలా పాస్ నుండి లే/లడఖ్ వైపు వెళ్లేందుకు బీఆర్‌వో అధికారులు ప్రాధమికంగా అనుమతించారు. జోజిలా పాస్ వద్ద ఇటీవల మంచు కురిసినప్పటికీ ఈ వాహనాలకు అనుమతినిచ్చారు.

జోజిలా పాస్ వద్ద భారీగా మంచు కురుస్తూ ఉండడంతో గత ఏడాది డిసెంబర్ నుండి 524 కిలోమీటర్ల ఈ రహదారిని మూసి ఉంచారు. కేంద్ర పాలిట ప్రాంతమైన లడఖ్‌లో నిత్యావసర వస్తువులు నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఏర్పడడంతో లడఖ్ డివిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు రహదారిని తెరిచారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 11,500 అడుగుల ఎత్తులో ఉన్న రహదారిపై తాజాగా పడిన మంచును ప్రాజెక్ట్ బీకాన్, ప్రాజెక్ట్ విజయక్ బృందాలు తొలగించాయి.

గత ఆరు దశాబ్దాల రికార్డును అధిగమిస్తూ ఈ ఏడాది అత్యధికంగా మంచు కురిసింది. మంచు తొలగించే కార్యక్రమాన్ని బి.ఆర్.ఓ.కి చెందిన ప్రాజెక్ట్ బీకాన్ బృందం గగన్ గిర్ నుండి జీరో పాయింట్ వరకు చేపట్టగా, జీరో పాయింట్ నుండి దాస్ వరకు ప్రాజెక్ట్ విజయక్ చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here